హోటళ్లలో రూమ్ బుక్ చేస్తే ఆధార్ కార్డ్ ఫోటోకాపీకి ఇకపై అనుమతి లేదు.. UIDAI కొత్త రూల్!

హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు మొదలైన సంస్థలు ధృవీకరణ కోసం కస్టమర్ల ఆధార్ కార్డుల ఫోటోకాపీలను తీసుకోవడం అలవాటు. అయితే ఇకపై వీటికి అనుమతి ఉండదు. కొత్త నిబంధనను తీసుకువస్తుంది UIDAI.

Published on: Dec 7, 2025, 22:02:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హోటళ్ళు, ఈవెంట్‌లకు వెళ్లినప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ లేదా వాట్సాప్ ద్వారా ఫోటోకాపీని పంపించమని అడుగుతారు. వెరిఫికేషన్ కోసం దీనిని కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. అయితే ఆధార్ సేఫ్టీ బలోపేతం చేయడానికి UIDAI కొత్త నియమాలను ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం హోటళ్ళు, ఈవెంట్ కంపెనీలు ఆధార్ ఫోటోకాపీలను తీసుకోవడానికి అనుమతి లేదు.

ఆధార్​ కార్డు కొత్త రూల్
ఆధార్​ కార్డు కొత్త రూల్

రిజిస్ట్రేషన్ తర్వాత హోటళ్లు, ఈవెంట్ సంస్థలు క్యూఆర్ స్కాన్ లేదా కొత్త యాప్‌ని ఉపయోగించి పేపర్‌లెస్‌గా వెరిఫికేషన్ చేయాలి. ఇది గోప్యత, డేటా భద్రతను మెరుగుపరుస్తుంది. చాలా మంది ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వాటిని ఎక్కడో పడేస్తుంటారు. దీని ద్వారా కస్టమర్లకు వివరాలు ఎవరి చేతికి వెళ్తాయో తెలియకుండా ఉంటుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కాగితం ఆధారిత ఆధార్ ధృవీకరణను తొలగించడానికి UIDAI పెద్ద మార్పును తీసుకువస్తుంది.

దీని కింద ఓయోతోపాటుగా ఇతర హోటళ్లు, ఈవెంట్ నిర్వాహకులు వంటి కంపెనీలు ఇకపై కస్టమర్ల ఆధార్ కార్డుల ఫోటోకాపీలను తీసుకోలేరు. వాటిని భౌతిక రూపంలో అంటే జిరాక్స్ తీసుకుని నిల్వ చేయలేరు. కొత్త నియమం త్వరలో వస్తుందని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఫోటోకాపీలను ఉంచుకోవడం ప్రస్తుత ఆధార్ చట్టానికి విరుద్ధమన్నారు.

ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ కోరుకునే హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు మొదలైన కంపెనీలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసే కొత్త నియమాన్ని ఆమోదించినట్టుగా UIDAI సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు. ఇది క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా ఆధార్ యాప్‌కు కనెక్ట్ చేయడం ద్వారా వ్యక్తులను ధృవీకరించడానికి వీలు కల్పించే కొత్త టెక్నాలజీని వారికి అందించనుంది.

కొత్త నియమాన్ని అథారిటీ ఆమోదించిందని, త్వరలో తెలియజేస్తామని భవనేష్ కుమార్ అన్నారు. హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు వంటి ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ అవసరమయ్యే కంపెనీలకు ఇక రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తుంది. ఇకపై పేపర్‌లెస్ ధృవీకరణ ఉండనుంది.

ఆఫ్‌లైన్ ధృవీకరణ అవసరమయ్యే సంస్థలు API (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్)కి యాక్సెస్ కలిగి ఉంటాయి. దీని ద్వారా వారు ఆధార్ ధృవీకరణ కోసం తమ సిస్టమ్‌లను అప్డేట్ చేసుకోవచ్చు. ప్రతి ధృవీకరణ కోసం సెంట్రల్ ఆధార్ డేటాబేస్ సర్వర్‌కు కనెక్ట్ చేయకుండానే యాప్-టు-యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించే కొత్త యాప్‌ను UIDAI బీటా-టెస్టింగ్ చేస్తోంది. విమానాశ్రయాలు, దుకాణాల వంటి ప్రదేశాలలో కూడా కొత్త యాప్‌ను ఉపయోగించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More