హైదరాబాద్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి డోర్ టు డోర్ పార్శిల్ సర్వీస్ యాప్
దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటింటికీ పార్శిల్ బుకింగ్, డెలివరీని అందించడానికి యాప్‌ను తీసుకు వస్తుంది. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా మెుదలుకానుంది.
సౌత్ సెంట్రల్ రైల్వే మరో కొత్త సర్వీస్‌ను ప్రవేశపెడుతోంది. ఇంటి నుంచే వినియోగదారులు పార్శిల్ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిద్వారా చాలా రకాలుగా ప్రయోజనం పొందనున్నారు. ఈ పార్శిల్ లాజిస్టిక్స్ సర్వీస్ మెుదటగా హైదరాబాద్ డివిజన్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. రైలు ద్వారా తమ పార్శిల్ బుక్ చేయాలనుకునేవారికి ఇకపై ఈజీగా ఉండనుంది. ఫస్ట్ మైల్ అంటే వస్తువులను తీసుకోవడం, మిడ్ మైల్ అంటే రైలు ద్వారా రవాణా, లాస్ట్ మైల్ అనగా డెలివరీ.. కాన్సెప్ట్‌తో వస్తోంది రైల్వే శాఖ.

సేవలను అందించేందుకు ఈ జోన్ ఏజెన్సీలు, లాజిస్టిక్స్ భాగస్వాములను పికప్, డెలివరీ సేవలను అందించడానికి రైల్వే శాఖ ఆహ్వానించింది. ఇవి రైలు ద్వారా రవాణాతో కనెక్ట్ అవుతాయి. ప్రతిపాదిత రైల్ పార్శిల్ యాప్ వినియోగదారులను ఒకే ప్లాట్‌ఫామ్‌లో బుక్ చేసుకోవడానికి, ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. సాధారణ వినియోగదారులు తమ ఇళ్ల నుండి దేశవ్యాప్తంగా పార్శిల్‌లను పంపడానికి వీలు కల్పిస్తుంది. SCR ఆన్‌లైన్ బుకింగ్, డిజిటల్ చెల్లింపులు, రియల్-టైమ్ ట్రాకింగ్, పూర్తి ఎండ్-టు-ఎండ్ విజిబిలిటీ వంటి ఫీచర్స్ ఉంటాయి.
ఈ ప్రాజెక్టు కోసం రైల్వేతో భాగస్వామ్యం అవడానికి ఆసక్తి ఉన్న సంస్థలు చర్చలు జరిపేందుకు, సేవలు అందించేందుకు చేసుకోవాల్సిన రిజిస్ట్రేన్ ప్రక్రియకు హైదరాబాద్ డివిజన్, దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్ వింగ్‌ను మెయిల్ ద్వారా లేదంటే వ్యక్తిగతంగా సంప్రదించాలని అధికారులు తెలిపారు.
ఈ కాన్సెప్ట్ పార్శిల్ రవాణాలో గేమ్ ఛేంజర్ కాగలదని, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు రైల్వేలతో సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. ఆసక్తిగల ఏజెన్సీలు చర్చలు, రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్ డివిజన్ వాణిజ్య విభాగాన్ని సంప్రదించవచ్చని చెప్పారు.
ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న యాప్, పార్శిల్ కార్యకలాపాలను ఆధునీకరించడం, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. రాబోయే రైల్ పార్శిల్ యాప్ వినియోగదారులకు షిప్‌మెంట్‌లను బుక్ చేసుకోవడానికి, ట్రాక్ చేయడానికి, నిర్వహించడానికి బాగా పనిచేస్తుంది. వ్యక్తులు, వాణిజ్య కస్టమర్‌లు, లాజిస్టిక్స్ భాగస్వాములు, రియు పరిశ్రమల వ్యక్తులను ఒకే డిజిటల్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. SCR ఈ యాప్‌ను మొదట హైదరాబాద్ డివిజన్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలని యోచిస్తోంది. తరువాత ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువస్తారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


