ప్రయాణికులకు విజ్ఞప్తి.. సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 4 నుంచి స్టార్ట్!
ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
శీతాకాల ప్రయాణ నెలల్లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి. కీలకమైన ప్రాంతీయ మార్గాల్లో రద్దీని తగ్గించడానికి, ప్రయాణికులకు సుదూర కనెక్టివిటీని సులభతరం చేయడానికి ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-అనకాపల్లి మార్గంలో 34 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. డిసెంబర్ 4 నుంచి 2026 మార్చి 26 వరకు నడుస్తాయి. షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్ నుండి అనకాపల్లికి రైలు 07055 డిసెంబర్ 4, 2025 నుండి మార్చి 26, 2026 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు 07056 డిసెంబర్ 5, 2025 నుండి మార్చి 27, 2026 వరకు నడుస్తాయి.
ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి వంటి ప్రధాన స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతాయి. ఈ సర్వీసులలో 1AC, 2AC, 3AC, స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ఇవి ప్రయాణీకులకు అనేక రకాల ప్రయాణ ఆప్షన్స్ అందిస్తాయి.
రద్దీగా ఉండే ప్రయాణ వారాల్లో ఉపశమనం అందించడం, సీజన్ అంతటా ప్రయాణికులకు కనెక్టివిటీ ఉండేలా చూడటం ఈ ప్రత్యేక రైళ్ల లక్ష్యం అని రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్‌కు మరో 4 కోచ్‌లు
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిటే వందే భారత్ రైలు 20 బోగీలతో వెళ్లనుంది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ఇప్పటి వరకు 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 14 ఏసీ చైర్‌కార్‌లతో కలిపి మొత్తం 16 బోగీలతో నడిచేది. ప్రయాణికుల విజ్ఞప్తుల నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
రైల్వే శాఖ తాజా నిర్ణయంతో మరో 4 ఏసీ చైర్‌కార్లను శాశ్వత ప్రాతిపదికన జోడిస్తారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మార్గంలో వందే భారత్‌కు స్టాపేజీలు, వేళల్లో ఎటువంటి మార్పులేదు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ద్వారా మొత్తం 660 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8గంటల 30నిముషాల్లోనే చేరుకుంటుంది. ఈ రూట్ లో నాలుగు స్టేషన్లు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే స్టాప్స్ ఉంటాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


