Virat Kohli : ఒకే ఒక్కడు ‘కింగ్​ కోహ్లీ’.. ఐపీఎల్​లో 9000 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్!

DC vs RCB : ఐపీఎల్ 2026లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 9000 పరుగుల మైలురాయిని దాటాడు. ఐపీఎల్​ చరిత్రలో ఈ మార్కును దాటిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

Published on: Apr 28, 2026, 05:57:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Most runs in IPL : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన కిరీటంలో మరో అరుదైన వజ్రాన్ని చేర్చుకున్నాడు! సోమవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే 9000 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. నవంబర్ 5, 1988న తాను పుట్టిన గడ్డపైనే, తన పేరు మీదున్న స్టాండ్స్ ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలోనే విరాట్ ఈ ఘనత సాధించడం విశేషం.

విరాట్​ కోహ్లీ.. (AFP)
విరాట్​ కోహ్లీ.. (AFP)

సొంత గడ్డపై చారిత్రక ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ 8989 పరుగుల వద్ద ఉన్నారు. ఇక రెండో ఇన్నింగ్స్​లో దుష్మంత చమీర వేసిన బంతిని స్ట్రైట్ డ్రైవ్ ద్వారా బౌండరీకి పంపి తన ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించిన కోహ్లీ, ఆ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 9000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 275 మ్యాచ్‌ల్లోనే ఆయన ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు.

దిల్లీ ఇచ్చిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ (23 నాటౌట్) సంయమనంతో ఆడాడు. లక్ష్యానికి చేరువైన సమయంలో టీ నటరాజన్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది, ఇంకా 13.3 ఓవర్లు మిగిలి ఉండగానే ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.

రికార్డుల రారాజు.. ఒకే జట్టుకు అంకితం

ఐపీఎల్ ప్రారంభం నుంచ నేటి వరకు ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరపున ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే కావడం విశేషం. 6000, 7000, 8000 పరుగుల మార్కును కూడా మొదట అందుకున్నది విరాటే. ప్రస్తుతం ఆయన ఖాతాలో 9012 పరుగులు ఉన్నాయి. ఇందులో సింహభాగం పరుగులు (3448) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే వచ్చాయి.

ఐపీఎల్​లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు..

ప్లేయర్జట్టుమ్యాచ్​లురన్స్అత్యధిక రన్స్
విరాట్​ కోహ్లీఆర్సీబీ2759012113
రోహిత్​ శర్మడెక్కన్​ ఛార్జర్స్​, ముంబై ఇండియన్స్2767183109*
శిఖర్​ ధవానదిల్లీ క్యాపిటల్స్​, ముంబై ఇండియన్స్, డెక్కన్​ ఛార్జర్స్, ఎస్​ఆర్​హెచ్, పంజాబ్ కింగ్స్2216769106*
డేవిడ్​ వార్నర్దిల్లీ క్యాపిటల్స్, ఎస్​ఆర్​హెచ్1846565126
కేఎల్​ రాహుల్ఆర్సీబీ, ఎస్​ఆర్​హెచ్, పంజాబ్​ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఎల్​ఎస్​జీ, డీసీ153*5580152

ఆరెంజ్ క్యాప్ రేసులో.. పాయింట్ల పట్టికలో దూకుడు!

ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులో 351 పరుగులతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు, ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. పంజాబ్ కింగ్స్ ఒక్క పాయింట్ తేడాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఆర్సీబీ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More