...
...
Next Story

సముద్రం అడుగున బుల్లెట్​ రైలు! దుబాయ్​ టు ముంబై ఇక రెండు గంటల్లో..

ముంబై నుండి దుబాయ్‌కి సముద్రం అడుగున ప్రయాణించే అద్భుత ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. గంటకు 1000 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ అండర్ వాటర్ రైలు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.

Published on: Dec 23, 2025, 09:10:22 IST
Advertisement

భారత్​లోని ముంబై నుంచి దుబాయ్‌కి మధ్య దాదాపు 1,900 కి.మీల దూరం ఉంటుంది. డైరక్ట్​ ఫ్లైట్​లో అయితే దాదాపు మూడున్నర గంటలు ట్రావెల్​ చేయాల్సి వస్తుంది. కానీ, ఈ డిస్టెన్స్​ని కేవలం 2 గంటల్లోనే పూర్తి చేయవచ్చు అంటే మీరు నమ్మగలరా? వినడానికే అసాధ్యం అనిపిస్తోంది కదూ!

ప్రపంచంలోనే తొలి అండర్​ వాటర్​ రైలు.. (AI generated image)
ప్రపంచంలోనే తొలి అండర్​ వాటర్​ రైలు.. (AI generated image)

కానీ ఈ కలను నిజం చేసే దిశగా ఒక సంచలన ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. భారత్‌లోని ముంబైని, యూఏఈలోని దుబాయ్‌ను కలుపుతూ అరేబియా సముద్రం అడుగున హై-స్పీడ్ అండర్ వాటర్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. గంటకు 600 నుంచి 1,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు.. విమానాల కంటే వేగంగా మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది!

సముద్ర గర్భంలో అద్భుత ప్రయాణం..

'డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్' పేరుతో పిలుస్తున్న ఈ ప్రాజెక్టు గురించి సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రైలు ప్రయాణించే టన్నెల్ గోడలకు పానోరమిక్ విండోలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అంటే, అరేబియా సముద్రం అడుగున సుమారు 200 మీటర్ల లోతులో ప్రయాణిస్తున్నప్పుడు మీ కళ్ల ముందే భారీ తిమింగలాలు, షార్క్‌లు, రంగురంగుల చేపల గుంపులు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియంలో ప్రయాణిస్తున్న ఎక్స్​పీరియెన్స్​ని ఇది ఇస్తుంది.

కేవలం ప్రయాణమే కాదు.. వ్యాపార వారధి కూడా!

దీని వల్ల కలిగే ప్రయోజనాలు:

  • ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గుతుంది (ప్రస్తుతం విమానంలో 3.5 గంటలు పడుతుంది).
  • ప్రయాణ ఖర్చులు దాదాపు 60 శాతం మేర తగ్గే అవకాశం ఉంది.
  • సుమారు 50,000 కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.
  • ముంబై నగరం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మారుతుంది.

"భారత్ - యూఏఈ మధ్య రవాణా రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పు కానుంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ప్రపంచం ఆశ్చర్యపోయే రీతులో అద్భుతం మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంది," అని ప్రాజెక్ట్​కి సంబంధించిన నిపుణులు వివరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అమలు సాధ్యాసాధ్యాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ కలల ప్రయాణం నిజమైతే, సముద్రం అడుగున బుల్లెట్ వేగంతో దూసుకెళ్లడం భారతీయులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

ఈ ప్రాజెక్ట్​ ఖర్చు, లాంచ్​ డేట్​ సహా అనేక విషయాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. త్వరలోనే దీనిపై అప్డేట్​ వచ్చే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks