బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న తీవ్ర వాయుగుండం ఉగ్రరూపం దాల్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్య, కళింగపట్నానికి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో రాబోయే 24 నుంచి 48 గంటల్లో దేశంలోని 19 రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్!

తీవ్ర వాయుగుండం భయానక ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ జనావాసాలను ముంచెత్తుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో విపరీతమైన వర్షపాతం నమోదవుతోంది.
తీరప్రాంత జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఐఎండీ ‘ఆకస్మిక వరదల’ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంట గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు అప్రమత్తం.. ప్రజలకు కఠిన మార్గదర్శకాలు
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దించాయి.
"ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. పాతబడిన భవనాలు, పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు, సైన్ బోర్డుల కింద నిలబడకూడదు," అని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని యంత్రాంగం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖ తీరాల్లో 3.5 మీటర్ల ఎత్తు వరకు భయానకమైన అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని, తీర ప్రాంతాల్లో పర్యాటక, వినోద కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది.
మధ్య, తూర్పు భారత్‌లో విరుచుకుపడుతున్న జలప్రళయం!
{{/usCountry}}సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని యంత్రాంగం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖ తీరాల్లో 3.5 మీటర్ల ఎత్తు వరకు భయానకమైన అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని, తీర ప్రాంతాల్లో పర్యాటక, వినోద కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది.
మధ్య, తూర్పు భారత్‌లో విరుచుకుపడుతున్న జలప్రళయం!
{{/usCountry}}ఈ వాయుగుండం ప్రభావం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఝార్ఖండ్, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. ఒడిశాలోని పూరీ, జగత్‌సింగ్‌పూర్, కటక్, ఖుర్దా, గంజాం జిల్లాల్లోనూ, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పూర్ ప్రాంతాల్లోనూ వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, పిడుగుపాటులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. గంగా నది తీర పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
ఈశాన్య ప్రాంతాల్లోనూ ఉధృతి.. వాయవ్యంలో పొడి వాతావరణం!
అటు ఈశాన్య భారతంలో అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ పరిధిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. మరోవైపు పశ్చిమ, ఉత్తర భారతదేశంలో కొంకణ్, గోవా, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితమయ్యాయి.