Dhanteras 2026 : ధన్​తేరాస్​కు బంగారం కొంటున్నారా? బ్లింకిట్​, ఇన్​స్టామార్ట్​లో భారీ డిస్కౌంట్లు

ధన్‌తేరస్ వేళ బంగారం, వెండి నాణేలు కొనేవారికి బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ షాకింగ్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దుకాణానికి వెళ్లే పని లేకుండా తక్కువ సమయంలోనే ఇంటికే బంగారం తెప్పించుకునే ఈ నయా ట్రెండ్ వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 6, 2026, 09:11:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఈ రోజు ధన్​తేరాస్. రోజున బంగారం కొంటే, లక్ష్మీదేవి ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని హిందువులు భావిస్తుంటారు. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బంగారం దుకాణాలు చుట్టూ తిరగడం చాలా మందికి కుదరదు! అయినా సరే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. నేటి డిజిటల్ యుగంలో 10 నిమిషాల్లో కూరగాయలు అందించే క్విక్ కామర్స్ సంస్థలు బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇప్పుడు మీ ఇంటి గుమ్మం ముందుకు స్వచ్ఛమైన లక్ష్మీదేవి, గణపతి ముద్రలు ఉన్న బంగారం, వెండి నాణేలను తీసుకొస్తున్నాయి! పైగా ఈ వేడుకల వేళ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఏకంగా 78 శాతం వరకు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.

ధన్​తేరాస్ వేళ బ్లింకిట్​, ఇన్​స్టామార్ట్​లో బంగాారంపై భారీ డిస్కౌంట్లు
ధన్​తేరాస్ వేళ బ్లింకిట్​, ఇన్​స్టామార్ట్​లో బంగాారంపై భారీ డిస్కౌంట్లు

మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ వంటి నగరాల్లో క్విక్ కామర్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. పండుగ రోజు షాపుల్లో ఉండే రద్దీ, ట్రాఫిక్ కష్టాలు తప్పించుకోవడానికి చాలామంది ఐటీ ఉద్యోగులు, బిజీ కుటుంబాలు ఈ యాప్‌ల ద్వారా ఆర్డర్లు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. జోయాలుక్కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, మియా బై తనిష్క్, ఎంఎంటీసీ-పాంప్ వంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన బ్రాండ్ల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్, 999 ప్యూరిటీ సిల్వర్ కాయిన్లు ఈ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

ధన్​తేరాస్ 2026- బ్లింకిట్‌లో 77 శాతం వరకు తగ్గింపు!

ధన్​తేరాస్ 2026 నాడు బ్లింకిట్ ప్లాట్‌ఫామ్‌పై జోయాలుక్కాస్, ముత్తూట్ ఎగ్జిమ్, ఎంఎంటీసీ-పాంప్ నాణేలపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి.

వెండి నాణేలు: ఎంఎంటీసీ-పాంప్ 10 గ్రాముల లక్ష్మీ గణేశ్ వెండి నాణెంపై అత్యధికంగా 77 శాతం డిస్కౌంట్‌ను బ్లింకిట్ అందిస్తోంది.

బంగారు నాణేలు: 0.5 గ్రాముల ఎంఎంటీసీ-పాంప్ తామర పువ్వు డిజైన్ ఉన్న బంగారు నాణెంపై గరిష్టంగా 71 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

బ్లింకిట్బరువు, ప్యూరిటీడిస్కౌంట్ ధరఎంఆర్​పీడిస్కౌంట్
Joyalukkas Lakshmi Ganesh Design Gold Coin1గ్రాము, 24కే ₹15,100 ₹30,00049%
Muthoot Exim Lakshmi Ganesh Design Gold Coin1గ్రాము, 24కే ₹15,100 ₹30,00049%
MMTC-PAMP Lotus Design Gold Coin0.5గ్రాము, 24కే ₹8,380 ₹29,00071%
Joyalukkas Lakshmi Ganesh Design Silver Coin10గ్రాము, 999 ₹2,175 ₹5,00056%
MMTC-PAMP Lakshmi Ganesh Design Silver Coin10గ్రాము, 999 ₹2,480 ₹11,00077%
Muthoot Exim Goddess Lakshmi Design Silver Coin10గ్రాము, 999 ₹2,175 ₹5,00056%

ధన్​తేరాస్ 2026- స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో 78 శాతం ధమాకా!

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కూడా కళ్యాణ్ జ్యువెలర్స్, మియా బై తనిష్క్, మలబార్, జీవా వంటి ప్రముఖ బ్రాండ్ల నాణేలను విక్రయిస్తోంది.

బంగారు నాణేలు: కళ్యాణ్ జ్యువెలర్స్ 1 గ్రామ్ ఫ్లవర్ గోల్డ్ కాయిన్ 43 శాతం డిస్కౌంట్‌తో రూ. 14,599 కే లభిస్తోంది. 1 గ్రాము కేటగిరీలో ఇదే అతి తక్కువ ధర కావడం విశేషం.

వెండి నాణేలు: కళ్యాణ్ జ్యువెలర్స్ 10 గ్రాముల లక్ష్మీదేవి వెండి నాణెంపై ఏకంగా 78 శాతం డిస్కౌంట్‌ను ఇన్‌స్టామార్ట్ ఇస్తోంది.

ఇన్​స్టామార్ట్బరువు, ప్యూరిటీడిస్కౌంట్ ధరఎంఆర్​పీడిస్కౌంట్
Kalyan Jewellers Flower Gold Coin1గ్రాము, 24కే ₹14,599 ₹26,00043%
Mia by Tanishq Lotus Gold Coin1గ్రాము, 24కే ₹16,639 ₹22,00024%
Malabar Lakshmi Gold Coin1గ్రాము, 24కే ₹15,879 ₹22,00027%
Kalyan Jewellers Lakshmi Silver Coin10గ్రాము, 999 ₹2,169 ₹10,00078%
Giva Lakshmi Ganesh Silver Coin10గ్రాము, 999 ₹2,499 ₹9,99975%
Malabar Lakshmi Ganesh Silver Coin10గ్రాము, 999 ₹2,829 ₹5,00043%

"డిస్కౌంట్లు ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కొనుగోలుదారులు ఆర్డర్ చేసే ముందు గ్రాములు, ప్యూరిటీ, హాల్ మార్కింగ్ పత్రాలను సరిచూసుకోవడం శ్రేయస్కరం," అని నిపుణులు సూచిస్తున్నారు.

ధన్​తేరాస్ 2026- ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

స్క్రీన్ మీద కనిపిచే భారీ ఆఫర్లను చూసి తొందరపడకుండా కొనుగోలుదారులు కొన్ని కీలక విషయాలను సరిచూసుకోవాలి:

స్వచ్ఛత అండ్ బరువు: నాణెం బరువు, 24 క్యారెట్ల ప్యూరిటీ లేదా 999 హాల్ మార్కింగ్ ఉందో లేదో ప్యాకింగ్ పరిశీలించాలి.

బ్రాండ్ అండ్ హాల్‌మార్క్: విశ్వసనీయ బ్రాండ్ ఆథెంటిసిటీ సర్టిఫికెట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

పన్నులు అండ్ డెలివరీ ఛార్జీలు: జీఎస్టీ, డెలివరీ రుసుములను బిల్లులో స్పష్టంగా గమనించాలి. డెలివరీ ప్రాంతం, ప్రాంతీయ స్టాక్‌ను బట్టి ధరలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

ఈ ధన్‌తేరస్ పండుగకు మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాన్ని ఎంచుకుని బంగారం, వెండి నాణేలను సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More