తెలంగాణ డిగ్రీ ప్రవేశాల్లో భారీగా సీట్లు ఖాళీ.. 64 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్లు!

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించిన దోస్త్ 2025 కౌన్సెలింగ్ ముగిసింది. అయితే ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు.

Published on: Jul 08, 2025 10:12 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని దోస్త్ కౌన్సెలింగ్ ముగిసింది. 64 డిగ్రీ కళాశాలలు సున్నా ప్రవేశాలను నమోదు చేశాయి. 4.36 లక్షల సీట్లలో దాదాపు 2.94 లక్షలు ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపు 3 లక్షలకు దగ్గరలో సీట్లు ఖాళీ అన్నమాట. జూలై 5న కళాశాలల కన్ఫర్మేషన్‌ ఎంపికతో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025 వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌ ముగిసింది.

ప్రతీకాత్మక చిత్రం (pixabay)
ప్రతీకాత్మక చిత్రం (pixabay)

తెలంగాణ ఉన్నత విద్యా మండలి పంచుకున్న దోస్త్ 2025 అడ్మిషన్ల గణాంకాలను పరిశీలించినప్పుడు దారుణంగా ఉన్నాయి. 64 డిగ్రీ కళాశాలలు 2025-26 విద్యా సంవత్సరానికి ఒక్క విద్యార్థిని కూడా అడ్మిషన్ పొందడంలో ఆకర్శించలేదు. ఈ కళాశాలల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం 20,260 సీట్లు ఉన్నాయి.

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో అత్యధికంగా 22 కళాశాలలు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 14 కళాశాలలు ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 13 కళాశాలలు సున్నా ప్రవేశాలతో ఉన్నాయి. అదే విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని ఐదు కళాశాలలు కూడా ఉన్నాయి. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక ప్రభుత్వ, ఒక ప్రైవేట్ కళాశాలకు ఒక్క ప్రవేశం కూడా రాలేదు.

మూడు రౌండ్ల వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ తర్వాత, 4,36,927 సీట్లలో 1,43,037 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, విశ్వవిద్యాలయ, ప్రైవేట్ కళాశాలలతో సహా 957 డిగ్రీ కళాశాలల్లో 2,93,890 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

విశ్వవిద్యాలయాల వారీగా ప్రవేశాల విషయానికొస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలలు 1,95,397 సీట్లలో 34 శాతం మాత్రమే ప్రవేశాలు పొందాయి. కాకతీయ విశ్వవిద్యాలయ కళాశాలలు మొత్తం 1,07,080 సీట్లలో 31 శాతం ప్రవేశాలు వచ్చాయి.

ఉన్నత విద్యా మండలి, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ దోస్త్ ఇంట్రా-కాలేజీ అడ్మిషన్‌ను ప్రకటించాయి. ఒకే కళాశాలలో తమ ప్రోగ్రామ్‌ను మార్చుకోవాలనుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో పాల్గొనవచ్చు. ఇది జూలై 9, 10 తేదీలలో అందుబాటులో ఉంటుంది. సీట్లు జూలై 11న కేటాయిస్తారు. వెబ్ కౌన్సెలింగ్ మొదటి, రెండు, మూడవ దశలలో కేటాయించిన సీట్లను నిర్ధారించుకున్న అభ్యర్థులు ఇంట్రా-ఫేజ్ కౌన్సెలింగ్‌కు అర్హులు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More