...
...
Next Story

DRDO recruitment : డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసిన వారికి సువర్ణావకాశం- డీఆర్​డీఓలో అప్రెంటిస్ పోస్టులు..

DRDO Apprentice Recruitment 2026 : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్​డీఓ)కు చెందిన ఎస్​ఎస్​పీఎల్ ల్యాబ్స్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21, 2026 లోపు తపాలా ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Published on: Aug 1, 2026, 06:04:23 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్​డీఓ) నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. దిల్లీలోని తిమార్పూర్​లో ఉన్న 'సోలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ' (ఎస్​ఎస్​పీఎల్)లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 21, 2026 నాటికి తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో (పోస్ట్ ద్వారా) పంపించాల్సి ఉంటుంది.

డీఆర్‌డీఓ ఎస్​ఎస్​పీఎల్ అప్రెంటీస్ పోస్టులు..
డీఆర్‌డీఓ ఎస్​ఎస్​పీఎల్ అప్రెంటీస్ పోస్టులు..

ఈ ప్రకటన ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు (12 నెలలు) ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో నిబంధనల ప్రకారం ప్రతినెల స్టైపెండ్ అందిస్తారు.

డీఆర్​డీఓ అప్రెంటిసిస్​ రిక్రూట్​మెంట్​ 2026- ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీల్లో డిప్లొమా అప్రెంటిస్‌లకు 41 స్థానాలను కేటాయించగా, ఐటీఐ, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు కూడా ఉన్నాయి. ల్యాబొరేటరీ అవసరాలకు అనుగుణంగా ఖాళీల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది.

డీఆర్​డీఓ అప్రెంటిసిస్​ రిక్రూట్​మెంట్​ 2026- విద్యా అర్హతలు:

ITI అప్రెంటిస్: డీఆర్​డీఓ అప్రెంటిసిస్​ రిక్రూట్​మెంట్​ 2026 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటు ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, మెషినిస్ట్, కార్పెంటర్ ట్రేడ్లలో ఫస్ట్ డివిజన్‌తో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

డిప్లొమా అప్రెంటిస్: పదో తరగతిలో ఫస్ట్ డివిజన్ సాధించడంతో పాటు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఫస్ట్ డివిజన్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లలో ఫస్ట్ డివిజన్‌తో బీఎస్సీ, లేదా బీఏ, బీకామ్ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, వీఎల్​ఎస్​ఐ, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఫస్ట్ డివిజన్‌తో బీఈ / బీటెక్ డిగ్రీ సాధించి ఉండాలి.

డీఆర్​డీఓ అప్రెంటిసిస్​ రిక్రూట్​మెంట్​ 2026- ఇతర అర్హత నిబంధనలు..

పోర్టల్ నమోదు తప్పనిసరి: డిప్లొమా, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎన్​ఏటీఎస్ పోర్టల్‌లో, ఐటీఐ అభ్యర్థులు Apprenticeship India పోర్టల్‌లో ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి డీఆర్​డీఓ అప్రెంటిసిస్​ రిక్రూట్​మెంట్​ 2026లో రిజర్వేషన్లు వర్తిస్తాయి.

డీఆర్​డీఓ అప్రెంటిసిస్​ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు ప్రక్రియ..

అభ్యర్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, దానికి సంబంధించిన విద్యార్హతలు, సర్టిఫికేట్ల స్వయం ధృవీకరణ ప్రతిపత్రాలను జతచేసి క్రింది చిరునామాకు రిజిస్టర్డ్ / సాధారణ పోస్ట్ ద్వారా పంపాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

Director, SSPL

Kind Attention: HRD

Solid State Physics Laboratory (SSPL)

DRDO, Lucknow Road, Timarpur, Delhi - 110054.

కాగా డీఆర్​డీఓ అప్రెంటిసిస్​ రిక్రూట్​మెంట్​ 2026 దరఖాస్తులు 2026 ఆగస్టు 21 నాటికి సంబంధిత కార్యాలయానికి చేరాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ లేదా తదుపరి సమాచారానికి సంబంధించిన కాల్ లెటర్లను కేవలం ఈ-మెయిల్ ద్వారా మాత్రమే పంపుతారు.

ఎంపికైన అభ్యర్థులు విధుల లో చేరే సమయంలో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

ఈ అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసినంత మాత్రాన డీఆర్‌డీఓ లేదా ఎస్‌ఎస్‌పీఎల్‌లో శాశ్వత ఉద్యోగానికి ఎలాంటి హక్కు ఉండదని గుర్తుపెట్టుకోవాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe