DRDO internship 2026 : డీఆర్డీఓలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు- ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం..
DRDO internship 2026 application form : డీఆర్‌డీఓ పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లను నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది మంచి ఛాన్స్! అప్లికేషన్ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) పరిధిలోని ప్రతిష్టాత్మక సంస్థ 'డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్' (డీఐపీఏఎస్) నిరుద్యోగ ఇంజనీరింగ్ విద్యార్థులకు అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. దిల్లీలోని దిపాస్‌తో పాటు హల్ద్వానీలోని డీఐబీఈఆర్ పరిశోధనా విభాగాల్లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రక్షణ రంగంలో పరిశోధనలు చేయాలనుకునే యువ ఇంజనీర్లకు ఇది ఒక మంచి వేదిక.

డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026 వివరాలు.. రూ. 15,000 స్టైపెండ్!
ఈ డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026 కాలపరిమితి మొత్తం ఆరు నెలలు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మొత్తం రూ. 15,000 స్టైపెండ్‌గా అందజేస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా రెండు విడతల్లో (మూడు నెలల తర్వాత సగం, కోర్సు పూర్తయ్యాక మిగిలిన సగం) చెల్లిస్తారు. కాగా స్టైపెండ్ పొందాలంటే విద్యార్థులు నెలకు కనీసం 15 రోజుల హాజరును కలిగి ఉండటం తప్పనిసరి అని డీఆర్‌డీఓ స్పష్టం చేసింది.
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026- ఎవరు అర్హులు?
ప్రస్తుతం బీఈ, బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్ చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
2026-27 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ (చివరి ఏడాది)లో ఉండబోయే అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అభ్యర్థులు తమ కాలేజీ నుంచి అధికారికంగా 'రెఫరల్/స్పాన్సర్‌షిప్ లెటర్' పొందాల్సి ఉంటుంది.
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026- ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థుల మార్కులు, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఇంటరాక్షన్ (ఇంటర్వ్యూ) ద్వారా తుది జాబితాను రూపొందిస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్కులు వస్తే, వారి పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకొని వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన వారి వివరాలను రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ద్వారా తెలియజేస్తారు.
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026- ఖాళీల వివరాలు..
మెకానికల్ ఇంజనీరింగ్ :- దీపాస్- 2, డీఐబీఈఆర్- 1
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ :- దీపాస్- 1
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ :- దీపాస్- 1, డీఐబీఈఆర్- 1
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ :- డీఐబీఈఆర్- 2
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026- దరఖాస్తు చేసుకునే విధానం
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తు పత్రాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో నింపి, అవసరమైన పత్రాలతో కలిపి పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
చివరి తేదీ: మే 15, 2026.
చిరునామా: The Director, Defence Institute of Physiology and Allied Sciences, DRDO, Ministry of Defence, Lucknow Road, Timarpur, Delhi - 110054.
గమనిక: ఎన్వలప్ కవర్‌పై "Application for Paid Internship with Discipline" అని సంబంధిత విభాగాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
రక్షణ రంగంలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే తెలుగు విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశం. ఆసక్తి ఉన్నవారు గడువు ముగియక ముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
డీఆర్‌డీఓ ఇంటర్న్‌షిప్ 2026 నోటిఫికేషన్/ అప్లికేషన్ ఫామ్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఈ ఇంటర్న్‌షిప్ కాలపరిమితి ఎంత?
ఈ ప్రోగ్రామ్ మొత్తం 6 నెలల పాటు సాగుతుంది.
2. స్టైపెండ్ మొత్తం ఎప్పుడు ఇస్తారు?
స్టైపెండ్‌ను రెండు వాయిదాల్లో ఇస్తారు. మొదటి మూడు నెలల తర్వాత సగం, ఆరో నెల పూర్తయిన తర్వాత మిగిలిన సగం మొత్తం అందుతుంది.
3. కేవలం బీటెక్ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయవచ్చా?
లేదు, బీఈ/బీటెక్‌తో పాటు ఎంటెక్/ఎంఈ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.
4. హాజరు నిబంధనలు ఏమైనా ఉన్నాయా?
అవును, స్టైపెండ్ పొందడానికి అభ్యర్థి నెలకు కనీసం 15 రోజుల ఫిజికల్ హాజరును కలిగి ఉండాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


