NMDC Recruitment 2026 : ఎన్‌ఎండీసీ హైదరాబాద్‌లో 59 ఉద్యోగాలు - నెలకు రూ. 60 వేల జీతం, దరఖాస్తు తేదీలివే
NMDC Hyderabad Recruitment 2026 : హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.మైనింగ్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. మే 6వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
NMDC Hyderabad Recruitment 2026 : హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ మైనింగ్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 59 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తారు.

59 ఖాళీలు….
ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మే 6వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 59 పోస్టులు ఉండగా…. వీటిలో ఓపెన్ కేటగిరీలో (UR) 27, ఓబీసీ - 15, ఎస్సీ (SC) - 8, ఎస్టీ- 4, EWS కోటా కింద 5 పోస్టులను కేటాయించారు.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు వారి ఫోటో, సంతకం, పదో తరగతి సర్టిఫికేట్, విద్యార్హత మరియు కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి మైనింగ్ ఇంజినీరింగ్‌లో కనీసం మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. మెటాలిఫెరస్ మైన్స్ కోసం ఫోర్‌మెన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 50 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
నెలకు రూ. 60 వేల జీతం….
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల జీతం చెల్లిస్తారు. అభ్యర్థి పనితీరు ఆధారంగా ఏటా 5 శాతం వరకు జీతం పెంచే అవకాశం ఉంది. తొలుత దరఖాస్తులను పరిశీలించి…. ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం అర్హులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ నియామకాలు ప్రారంభంలో మూడేళ్ల కాలపరిమితికి లేదా అభ్యర్థికి 60 ఏళ్లు నిండే వరకు (ఏది ముందైతే అది) ఉంటాయి. పనితీరు. సంస్థ అవసరాలను బట్టి ఈ కాలాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది.
- ఉద్యోగ నోటిఫికేషన్ - నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్
- ఉద్యోగాలు - జూనియర్ ఇంజినీర్ (మైనింగ్)
- మొత్తం ఖాళీలు - 59
- జీతం: నెలకు రూ.60,000
- ఎంపిక ప్రక్రియ - సూపర్వైజరీ స్కిల్ అసెస్‌మెంట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- దరఖాస్తుకు చివరి తేదీ: 06.05.2026.
- అధికారిక వెబ్‌సైట్: https://www.nmdc.co.in/
- హెల్ప్ లైన్ నెంబర్ - 7044599061
- హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడీ - deskcontroller@gmail.com
ఈ లింక్ పైక్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

