దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్ తేదీలివే
దేశంలో 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
భారత ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఎన్నికలకోడ్ తక్షణమే అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

తమిళనాడులో234 అసెంబ్లీ స్థానాలు, పశ్చిమ బెంగాల్-294, కేరళ-140, అస్సాం-126, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి-30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ.
పోలింగ్ తేదీలు
- అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది.
- తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహిస్తారు.
- పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో పోలింగ్ ఉంటుంది. మెుదటి దశ ఏప్రిల్ 23, రెండో ఏప్రిల్ 29న పోలింగ్ నిర్వహిస్తారు
- మే 4న కౌంటింగ్ ఉంటుంది.
ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం కలిపి మొత్తం 174 మిలియన్ల (17.4 కోట్ల) ఓటర్లు ఉన్నారు. 824 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టుగా, 25 లక్షల ఎన్నికల అధికారులు పని చేస్తారని ఈసీ తెలిపింది.
గత 12 నెలల కాలంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించేందుకు ఎన్నికల సంఘం అనేక కొత్త కార్యక్రమాలను అమలు చేసిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. వీటిలో మొదటిది SIR అనే విధానం; ఓటర్ల జాబితాలో ఏ ఒక్క అనర్హుడు కూడా మిగిలి ఉండకుండా చూసే లక్ష్యంతో దీనిని రూపొందించారు. రెండో విధానం ప్రకారం, పోలింగ్ కేంద్రం వెలుపలే మొబైల్ ఫోన్లను అప్పగించాల్సి ఉంటుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వాటిని తిరిగి తీసుకోవచ్చు.
ఎన్నికల షెడ్యూల్‌తో ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) తక్షణమే అమల్లోకి వచ్చింది. పుదుచ్చేరితోపాటుగా నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్‌లో పలు తేదీల్లో ముగుస్తుంది. ఈ రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను ఈసీ పూర్తి చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు పలు రాష్ట్రాల్లోనూ ఈసీ పర్యటించింది.
- కోవిడ్-19 మహమ్మారి మధ్య జరిగిన 2021 అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ ఎనిమిది దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశ పోలింగ్ మార్చి 27న, చివరిది ఏప్రిల్ 29న జరిగింది. అనేక రాజకీయ పార్టీల నాయకులు ఈసారి ఎన్నికలు రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. సుదీర్ఘ షెడ్యూల్ ఎన్నికల ఖర్చులను పెంచుతుందని, ఓటింగ్ గురించి ప్రజల స్ఫూర్తిని తగ్గిస్తుందని అధికారులకు చెప్పారు. చివరకు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


