ఎటర్నల్ క్యూ1 ఫలితాలు: ₹92 కోట్లకు చేరిన జొమాటో పేరెంట్ సంస్థ లాభం
జొమాటో మాతృ సంస్థ 'ఎటర్నల్' 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక (Q1FY27) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 268 శాతం పెరిగి ₹92 కోట్లకు చేరింది.
జొమాటో మాతృ సంస్థ 'ఎటర్నల్' (Eternal) బుధవారం (జూలై 22) తమ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ (Q1FY27) త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం ₹92 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన ₹25 కోట్లతో పోలిస్తే ఇది 268 శాతం అధికం.
రాబడిలో భారీ వృద్ధి
కంపెనీ ఏకీకృత కార్యకలాపాల రాబడి ఏడాది ప్రాతిపదికన (YoY) 182 శాతం పెరిగి ₹20,211 కోట్లకు చేరింది. గతేడాది తొలి త్రైమాసికంలో (Q1FY26) రాబడి ₹7,167 కోట్లుగా నమోదు కావడం గమనార్హం.
అయితే, క్రితం త్రైమాసికంతో (Q4FY26) పోలిస్తే నికర లాభం 47.1 శాతం క్షీణించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో (Q4FY26) కంపెనీ ₹174 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. ప్రస్తుతం అది ₹92 కోట్లకు పరిమితమైంది. రాబడి మాత్రం క్రితం త్రైమాసికంలోని ₹17,292 కోట్లతో పోలిస్తే 16.88 శాతం వృద్ధి చెందింది.
'నగ్గెట్' వ్యాపార పునర్వ్యవస్థీకరణ
ఆర్థిక ఫలితాల ప్రకటనతో పాటు ఎటర్నల్ ఒక కీలకమైన వ్యాపార నిర్ణయాన్ని వెల్లడించింది. సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా 'నగ్గెట్ బై జొమాటో' (Nugget by Zomato) వ్యాపారాన్ని తమ పూర్తి అనుబంధ సంస్థ అయిన కార్థెరో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (Carthero Technologies) బదిలీ చేయడానికి బిజినెస్ ట్రాన్స్‌ఫర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


