SWAYAM సహకారంతో ఫ్రీ ‘మెషిన్ లెర్నింగ్’ కోర్సును అందిస్తోంది ఐఐటీ మద్రాస్. ఈ కోర్సుకు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఫ్రాడ్ డిటెక్షన్, స్పామ్ ఇమెయిల్స్ గుర్తించడం, ఇంటి ధరలను అంచనా వేయడం వంటి మెషిన్ లెర్నింగ్, సంబంధిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పనుల్లో తమ నైపుణ్యాలను పెంచుకోవాలని చూస్తున్న విద్యార్థులు, నిపుణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2025 ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశంలోనే అగ్రశ్రేణి ఇంజనీరింగ్ సంస్థ అయిన ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఈ కోర్సును బోధిస్తారు.
ఐఐటీ మద్రాసు ఫ్రీ మెషిన్ లెర్నింగ్ కోర్సు- తేదీలు

కోర్సు ప్రారంభం: జనవరి 19, 2026
కోర్సు ముగింపు: ఏప్రిల్ 10, 2026
రిజిస్ట్రేషన్ గడువు: ఫిబ్రవరి 13, 2026 వరకు రిజిస్ట్రేషన్లు తెరిచి ఉంటాయి.
ఈ కోర్సును ఐఐటీ మద్రాస్‌లోని కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, మైండ్‌ట్రీ ఫ్యాకల్టీ ఫెలో అయిన బాలరామన్ రవీంద్రన్ బోధిస్తారు. ఇది సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది.
ఐఐటీ మద్రాసు ఫ్రీ మెషిన్ లెర్నింగ్ కోర్సు- అర్హత
ఈ కోర్సులో ప్రోగ్రామింగ్ అవసరమయ్యే అసైన్‌మెంట్‌లు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులకు మెషిన్ లెర్నింగ్ కోసం సాధారణంగా ఉపయోగించే పైథాన్ లేదా ఆర్ వంటి భాషలపై పరిజ్ఞానం ఉండాలి. కంప్యూటర్ సైన్స్ నేపథ్యం లేని విద్యార్థుల కోసం ప్రాథమిక అంశాలు కూడా కవర్ అవుతాయి. అయితే, లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ థియరీ గురించి ముందుగా తెలుసుకోవడం సహాయపడుతుంది.
కోర్సులో ఏ అంశాలు బోధిస్తారు?
ఈ మూడు నెలల కోర్సు ప్రాథమిక గణిత భావనలైన ప్రాబబిలిటీ థియరీ, లీనియర్ ఆల్జీబ్రా, కాన్వెక్స్ ఆప్టిమైజేషన్ రివిజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెండు ముఖ్యమైన రకాలైన పర్యవేక్షిత అభ్యాసం – రిగ్రెషన్, క్లాసిఫికేషన్– లోకి వెళుతుంది. క్లాసిఫికేషన్ డేటాను కేటగిరీలుగా విభజించడానికి ఉపయోగపడుతుంది. అయితే రిక్రెషన్ నిరంతర విలువలను అంచనా వేస్తుంది.
కోర్సులో కవర్ చేసే ఇతర అల్గోరిథమ్‌లు, భావనలు:
{{/usCountry}}కోర్సులో కవర్ చేసే ఇతర అల్గోరిథమ్‌లు, భావనలు:
{{/usCountry}}లీనియర్ క్లాసిఫికేషన్
లాజిస్టిక్ రిక్రెషన్
న్యూరల్ నెట్‌వర్క్‌లు
డెసిషన్ ట్రీస్
రిగ్రెషన్ ట్రీస్
గ్రేడియంట్ బూస్టింగ్
రాండమ్ ఫారెస్ట్స్
రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌కు ఇంట్రొడక్షన్
కోర్సు సర్టిఫికేట్
ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 17, 2026 న జరిగే పరీక్ష కోసం నమోదు చేసుకోవాలి. ఈ పరీక్ష ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2 నుండి 5 వరకు రెండు సెషన్లలో ఉంటుంది. పరీక్ష రుసుము రూ. 1,000 ఉంటుంది. ఇది నిర్ణీత పరీక్షా కేంద్రాల్లో జరుగుతుంది.
ఐఐటీ మద్రాస్ మెషిన్ లెర్నింగ్ కోర్సు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
అధికారిక వెబ్‌సైట్ లింక్‌ను సందర్శించండి: Machine Learning Swayam Course
"Join" పై క్లిక్ చేసి, మీ జిమెయిల్ లేదా మైక్రోసాఫ్ట్ ఐడీతో లాగిన్ అవ్వండి.
అవసరమైన వివరాలను నమోదు చేయండి, ఆ తర్వాత మీరు కోర్సు కోసం రిజిస్టర్ అవుతారు.