మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు: ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇవే

అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పైకి లేచాయి. అక్టోబర్ 1 గురువారం నాటికి హైదరాబాద్ సహా వివిధ ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల పసిడితో పాటు వెండి ధరల వివరాలు ఇక్కడ చూడవచ్చు.

Published on: Oct 1, 2026, 09:53:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి కారణముగా పసిడి, వెండి ధరలు మళ్లీ లాభాల బాట పట్టాయి. అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన భౌగోళిక ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపాయి. జులైలో విఫలమైన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత, గత వారం ఇరుదేశాల మధ్య తొలిసారి పరోక్ష చర్చలు జరిగినప్పటికీ పరిస్థితులు రగులుతూనే ఉన్నాయి. ఇరాన్‌పై సైనిక చర్య లేదా కొత్త ఒప్పందం అనే రెంటింటిలోనే ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు

మరోవైపు న్యూయార్క్‌లో జరుగుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ నేతృత్వంలోని బృందాన్ని తక్షణమే దేశం వీడి వెళ్లాల్సిందిగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశించినట్లు నివేదికలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ మళ్లీ పెరిగింది.

ఎంసీఎక్స్ ఫ్యూచర్స్, రిటైల్ మార్కెట్ ధరలు

అక్టోబర్ 1 గురువారం ప్రారంభ వర్తకంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో నవంబర్ 5 గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.24 శాతం పెరిగి 10 గ్రాములకు ₹1,48,288 వద్ద నమోదైంది. డిసెంబర్ 4 సిల్వర్ కాంట్రాక్టుల ధరలు 0.9 శాతం పెరిగి కిలోకు ₹225,730కి చేరాయి. ఇండియన్ బులియన్ అసోసియేషన్ (ఐబీఏ) సమాచారం ప్రకారం రిటైల్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ₹149,590 కాగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర ₹137,124గా ఉంది. వెండి (999 ఫైన్) ధర కిలోకు ₹225,920 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరలకు స్థానిక పన్నులు, జీఎస్టీ, తయారీ తరుగు (మేకింగ్ ఛార్జీలు) అదనంగా తోడవుతాయి.

ప్రధాన నగరాల్లో నేటి రేట్లు (10 గ్రాముల బంగారం, 1 కిలో వెండి)

దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో అక్టోబర్ 1న నమోదైన రిటైల్ ధరల వివరాలు:

  • హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం ₹149,560; 22 క్యారెట్ల బంగారం ₹137,097; వెండి కిలో ₹225,870.
  • ముంబై: 24 క్యారెట్ల బంగారం ₹149,320; 22 క్యారెట్ల బంగారం ₹136,877; వెండి కిలో ₹225,510.
  • న్యూఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం ₹149,060; 22 క్యారెట్ల బంగారం ₹136,638; వెండి కిలో ₹225,120.
  • బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం ₹149,440; 22 క్యారెట్ల బంగారం ₹136,987; వెండి కిలో ₹225,690.
  • కోల్‌‌కతా: 24 క్యారెట్ల బంగారం ₹149,120; 22 క్యారెట్ల బంగారం ₹136,693; వెండి కిలో ₹225,210.
  • చెన్నై: 24 క్యారెట్ల బంగారం ₹149,690; 22 క్యారెట్ల బంగారం ₹137,216; వెండి కిలో ₹225,910.
  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More