జూన్​ 29 : భారీగా పడిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో రూ. 97,500 దిగువకు!

దేశంలో బంగారం ధరలు ఆదివారం దిగొచ్చాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​తో పాటు ఇతర ప్రాంతాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 29, 2025, 10:30:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో బంగారం ధరలు జూన్​ 29, ఆదివారం భారీగా పడ్డాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 590 రూ. 97,593గా కొనసాగుతోంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 9,759గా ఉంది. మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 540 దిగొచ్చి రూ. 89,473కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 8,947గా ఉంది.

దిల్లీలోని ఒక బంగారు ఆభరణాల దుకాణంలో మోడల్స్​.. (PTI)
దిల్లీలోని ఒక బంగారు ఆభరణాల దుకాణంలో మోడల్స్​.. (PTI)

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం భారీగా పెరిగి, రూ. 1లక్ష మార్క్​ తాకిన 24 క్యారెట్ల బంగారంధర, ఇప్పుడు తగ్గుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం తగ్గాయి. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,325 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,445గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,321గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,441గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,315గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,435గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,329గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,449గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,335గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,445గా నమోదైంది. విశాఖపట్నంలో ధరలు వరుసగా రూ. 89,337- రూ. 97,457గా ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,381గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 97,501గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 89,320గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,440గా ఉంది.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 11,090గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1,10,900కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,21,000 పలుకుతోంది. విజయవాడలో రేటు రూ. 1,21,900గా ఉంది. విశాఖపట్నంలో 1,19,500గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More