గూగుల్ ఇండియా తమ గూగుల్ మ్యాప్స్‌లో ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ప్రయాణాన్ని మరింత స్మార్ట్‌గా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు జెమినీ ఏఐ ఇంటిగ్రేషన్‌తో కూడిన కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇటీవలే చేసిన ఒక ప్రకటనలో, ఈ అప్‌డేట్ ద్వారా ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెన్స్, రియల్ టైమ్ ట్రాఫిక్ అలర్ట్స్, మెరుగైన రోడ్డు భద్రతా సాధనాలు భారతదేశంలోని లక్షలాది వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని గూగుల్ తెలిపింది.
గూగుల్ మ్యాప్స్‌లో రానున్న ఆరు ముఖ్య మార్పులు ఇవే..

1. జెమినీ ఏఐతో హ్యాండ్స్-ఫ్రీ అన్వేషణ
ఈ కొత్త అప్‌డేట్‌తో, వినియోగదారులు ఇప్పుడు కేవలం “ఓకే గూగుల్” అని చెప్పి.. హ్యాండ్స్-ఫ్రీగా అన్వేషణను ప్రారంభించవచ్చు. గూగుల్ ఏఐ అసిస్టెంట్ అయిన జెమినీ, వాయిస్ కమాండ్‌ల ద్వారానే సమీపంలోని ప్రాంతాలను కనుగొనడం, ప్రశ్నలు అడగడం లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మీ లైవ్ లొకేషన్‌ను షేర్ చేయడం వంటి పనుల్లో సహాయపడుతుంది.
2. ప్రయాణానికి ముందు తెలివైన స్థానిక సమాచారం
బయలుదేరే ముందు, వినియోగదారులు ఇప్పుడు ప్రదేశాల గురించి ఏఐ-ఆధారిత "స్మార్ట్ టిప్స్" పొందవచ్చు. ఇందులో ప్రధాన ముఖ్యాంశాలు, స్థానిక సమాచారం, సిఫార్సులు ఉంటాయి. అంతులేని రివ్యూలను స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా, ప్రయాణికులు కేవలం జెమినీని అడిగి పార్కింగ్ లభ్యత లేదా రెస్టారెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలు వంటి రియల్ టైమ్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు!
3. ఆఫ్‌లైన్‌లో కూడా ట్రాఫిక్ అప్‌డేట్‌లు
ఈ అప్‌డేట్‌లలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది.. రియల్ టైమ్ ట్రాఫిక్ జామ్‌లు, రోడ్‌బ్లాక్‌ల గురించిన హెచ్చరికలు. ఈ ఫీచర్ అప్లికేషన్ వాడుకలో లేనప్పటికీ కనిపిస్తుంది. భారతదేశంలో రద్దీగా ఉండే రోడ్లపై ప్రయాణించేటప్పుడు వినియోగదారులు ట్రాఫిక్ జామ్‌ల కంటే ఒక అడుగు ముందు ఉండటానికి, సాఫీగా ప్రయాణించడానికి ఇది ఉపయోగపడుతుంది.
4. ఏఐ అలర్ట్స్తో రోడ్డు భద్రత మెరుగుదల
{{/usCountry}}4. ఏఐ అలర్ట్స్తో రోడ్డు భద్రత మెరుగుదల
{{/usCountry}}ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తుంది. ఇది డ్రైవర్లు సురక్షితమైన మార్గాలను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్ రోడ్డు భద్రత దిశగా గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో భాగం. హై-రిస్క్ ప్రాంతాలను గుర్తించడానికి ఏఐ- స్థానిక డేటాను ఉపయోగిస్తారు.
5. ఎన్హెచ్ఏఐ సహకారంతో మెరుగైన ట్రావెల్ సమాచారం
దేశవ్యాప్తంగా ప్రయాణ సమాచారాన్ని మెరుగుపరచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, రోడ్డు మూసివేతలు, నిర్వహణ పనులు, దారి మళ్లింపులకు సంబంధించిన ధృవీకరించిన- రియల్ టైమ్ అప్‌డేట్‌లు నేరుగా ఎన్హెచ్ఏఐ నుంచే పొంది, వాటిని గూగుల్ మ్యాప్స్‌లో ప్రదర్శిస్తారు.
6. హైవేలపై సౌకర్యాల వివరాలు
అదనంగా, హైవేల వెంబడి ఉన్న సౌకర్యాల వివరాలను కూడా వినియోగదారులు చూడగలరు. ఇందులో పబ్లిక్ రెస్ట్‌రూమ్స్, ఫ్యూయల్ స్టేషన్లు, ఆహార కేంద్రాలు ఉంటాయి. ఇది ప్రయాణికులు సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది.
ఏఐ, చురుకైన భద్రతా హెచ్చరికలను కలపడం ద్వారా.. భారతదేశంలో ప్రజలు ప్రయాణించే విధానాన్ని గూగుల్ మ్యాప్స్ మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ప్రయాణాన్ని స్మార్ట్‌గా, వేగంగా, సురక్షితంగా చేయడమే దీని ఉద్దేశం.