ఫిబ్రవరిలోనే Google Pixel 10a లాంచ్? ధర, ఫీచర్ల వివరాలు ఇవే..

గూగుల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 10ఏ'ను ఫిబ్రవరి 2026 నాటికి మార్కెట్​లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. టెన్సర్ జీ4 చిప్‌సెట్, 120హెచ్​జెడ్​ అమోలెడ్ డిస్​ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్ వివరాలు లీక్ అయ్యాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 14, 2026, 19:30:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో గూగుల్ పిక్సెల్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గూగుల్ తన పిక్సెల్ లైనప్‌లో మరో కొత్త స్మార్ట్​ఫోన్‌ని చేర్చడానికి సిద్ధమవుతోంది. పిక్సెల్ 'ఏ' సిరీస్‌లో భాగంగా 'గూగుల్ పిక్సెల్ 10ఏ'.. ఫిబ్రవరి 2026 మధ్య నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆన్‌లైన్ లీకులు సూచిస్తున్నాయి. కంపెనీ దీనిపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ, టెక్ వర్గాల్లో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్​ పిక్సెల్​ 10ఏ..
గూగుల్​ పిక్సెల్​ 10ఏ..

ఈ నేపథ్యంలో గూగుల్​ పిక్సెల్​ 10ఏపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గూగుల్​ పిక్సెల్​ 10ఏ- కలర్స్​, స్టోరేజ్ ఆప్షన్లు..

తాజా నివేదికల ప్రకారం.. పిక్సెల్ 10ఏ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. ఒకటి 128జీబీ కాగా, మరొకటి 256జీబీ. అలాగే వినియోగదారులను ఆకట్టుకునేలా అబ్సిడియన్, బెర్రీ, ఫాగ్, లావెండర్ అనే నాలుగు రంగుల్లో ఈ స్మార్ట్​ఫోన్ రానుంది.

అంటే.. గూగుల్ తన సాధారణ వ్యూహానికి అనుగుణంగానే పరిమితమైన, కానీ ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకురాబోతోంది.

గూగుల్​ పిక్సెల్​ 10ఏ- ధర..

ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న గూగుల్​ పిక్సెల్​ 9ఏ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర 329.9 డాలర్లుగా ఉంది. 256జీబీ వేరియంట్​ ధర 449.99 డాలర్లు (సుమారు రూ. 39,100)గా ఉంది.

గూగుల్​ పిక్సెల్ 10ఏ కూడా అదే స్థాయిలో లేదా స్వల్ప మార్పులతో వచ్చే అవకాశం ఉంది.

బడ్జెట్ ధరలో గూగుల్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక కానుంది.

గూగుల్​ పిక్సెల్​ 10ఏ- డిస్​ప్లే, కెమెరా..

మీడియా నివేదికల ప్రకారం.. ఈ గూగుల్​ పిక్సెల్​ 10ఏ స్మార్ట్​ఫోన్ 6.28 ఇంచు అమోలెడ్ డిస్​ప్లేతో రానుంది. ఇందులో ఫుల్​ హెచ్​డీ+ రిజల్యూషన్, 120హెచ్​జెడ్​ రీఫ్రెష్ రేట్ ఉండబోతున్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే:

ప్రధాన కెమెరా: 48ఎంపీ రియర్ సెన్సార్

అల్ట్రావైడ్ కెమెరా: 13ఎంపీ సెన్సార్

సెల్ఫీ కెమెరా: 13ఎంపీ ఫ్రంట్ కెమెరా

ఎప్పటిలాగే గూగుల్ తన అద్భుతమైన సాఫ్ట్‌వేర్ ప్రాసెసింగ్ ద్వారా కెమెరా క్వాలిటీని మెరుగుపరచనుంది.

గూగుల్​ పిక్సెల్​ 10ఏ- బ్యాటరీ, ప్రాసెసర్..

లీకుల ప్రకారం ఈ ఫోన్‌లో 5,100ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఉండనుంది. ఈ విభాగంలోని ఇతర ఫోన్లతో పోలిస్తే ఇది మెరుగైన బ్యాటరీ లైఫ్ ఇస్తుంది! ఇక ప్రాసెసర్ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. తొలుత ఇందులో టెన్సర్ జీ5 చిప్‌సెట్ ఉంటుందని భావించినప్పటికీ, తాజా నివేదికలు మాత్రం గూగుల్ 'టెన్సర్ జీ4' చిప్‌ను వాడే అవకాశం ఉందని చెబుతున్నాయి. దీనికి తోడు 8జీబీ ర్యామ్ జతకానుంది.

పిక్సెల్ 9ఏ స్మార్ట్​ఫోన్​తో పోలిస్తే ఈ కొత్త మోడల్ డిజైన్, పనితీరులో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలని టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More