అతి తక్కువ ధరకు Google Pixel 9 Pro.. అమెజాన్​లో ది బెస్ట్​ డీల్​!

గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5జీపై భారీ తగ్గింపు లభిస్తోంది! రూ. 85,000లోపే ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 18, 2025 5:31 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీరు అత్యుత్తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? మార్కెట్‌లో చాలా ఆప్షన్లు ఉండడంతో ఏది తీసుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే మీ కోసమే అమెజాన్‌లో ఓ అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది! గత సంవత్సరం విడుదలైన గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5జీ స్మార్ట్​ఫోన్​పై అమెజాన్ ప్రస్తుతం భారీ తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ ప్రీమియం ఫోన్‌ను మీరు కేవలం రూ. 85,000 లోపు కొనుగోలు చేసే అవకాశం లభించింది.

గూగుల్​ పిక్సెల్​ 9 ప్రో (Google)
గూగుల్​ పిక్సెల్​ 9 ప్రో (Google)

మీరు చాలా కాలంగా గూగుల్ పిక్సెల్ పరికరం కొనాలని ప్లాన్​ చేస్తూ ఉంటే.. ఈ ధర తగ్గింపు కారణంగా ఈ మోడల్ మీకు గొప్ప ఆప్షన్​ అవుతుంది! పూర్తి వివరాల్లోకి వెళిత..

గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5జీ ధర ఎంత తగ్గిందంటే..

నిజానికి, 16జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అయిన గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5జీ అసలు ధర రూ. 1,09,999 గా ఉండేది. కానీ అమెజాన్‌లో ప్రస్తుతం దీనిని కేవలం రూ. 86,900కే విక్రయిస్తున్నారు. అంటే, కొనుగోలుదారులకు ఏకంగా 21% వరకు తగ్గింపు లభిస్తోంది.

ఈ-కామర్స్ తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్​ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఉపయోగించి ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు.

ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 10,000 కనిష్ట కొనుగోలు విలువపై 7.5% తక్షణ తగ్గింపు (గరిష్టంగా రూ. 3000 వరకు) పొందవచ్చు.

యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 5,000 కనిష్ట కొనుగోలు విలువపై 7.5% తక్షణ తగ్గింపు (గరిష్టంగా రూ. 1000 వరకు) అందుబాటులో ఉంది.

ఇక, ఎక్స్​ఛేంజ్ ఆఫర్ కింద పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా రూ. 44,100 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. అయితే, ఈ ఎక్స్​ఛేంజ్ విలువ మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, అది పనిచేసే పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5జీని ఎందుకు కొనాలి?

గూగుల్ పిక్సెల్ 9 ప్రో 5జీ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది:

డిస్‌ప్లే: ఇది 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.3-అంగుళాల ఎల్​టీపీఓ ఓఎల్​ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కంటికి ఇంపైన, వేగవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.

ప్రాసెసర్: ఈ స్మార్ట్‌ఫోన్ గూగుల్ టెన్సర్ జీ4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 16జీబీ ర్యామ్​, 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

కెమెరా: ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ మెయిన్ కెమెరా, 48ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 5ఎక్స్​ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. పిక్సెల్ ఫోన్‌ల కెమెరా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బ్యాటరీ: పిక్సెల్ 9 ప్రో 4700 ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తుంది. ఇది 27డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

అద్భుతమైన కెమెరా, పటిష్టమైన పనితీరు, లేటెస్ట్​ ఆండ్రాయిడ్ ఫీచర్లతో కూడిన ఈ ఫ్లాగ్‌షిప్ 5జీ ఫోన్‌ను ఈ ప్రత్యేక తగ్గింపు ధరలో సొంతం చేసుకోవడం మంచి అవకాశం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More