గర్ల్ ఫ్రెండ్‌తో రొమాన్స్..కొడుక్కి ల్యాండ్ రోవర్ గిఫ్ట్.. హాట్ టాపిక్‌గా హార్దిక్ పాండ్య..డెలివరీ తీసుకున్న మాజీ భార్య

ఓ వైపు క్రికెట్, మరోవైపు పర్సనల్ లైఫ్ విషయాలతో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా తన కొడుక్కి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ సమయంలో మాజీ భార్య నటాషా పక్కనే ఉంది. ఈ కారు ధర తెలిస్తే షాక్ అవుతారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. 

Published on: Feb 22, 2026, 17:08:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 ప్రపంచకప్ లో ఆటతో అదరగొడుతున్న హార్దిక్ పాండ్య తన పర్సనల్ లైఫ్ పరంగానూ వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్ గా తన గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే సందర్భంగా రొమాంటిక్ ఫొటో, వీడియోను అతను షేర్ చేశాడు. ఇప్పుడు తన కొడుకు అగస్త్యకు ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ తన కొడుకు పక్కనే ఉండి కారు డెలివరీ తీసుకుంది.

కారు గిఫ్ట్ గా తీసుకుంటున్న అగస్త్య (Land Rover Mumbai - Instagram)
కారు గిఫ్ట్ గా తీసుకుంటున్న అగస్త్య (Land Rover Mumbai - Instagram)

ఖరీదైన కారు

హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిచ్ భార్యాభర్తలుగా విడిపోయినా తమ కొడుకు అగస్త్యను ఇద్దరూ కలిసి పెంచుకుంటున్నారు. తమ కొడుకు పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి చాటిచెప్పేలా ఇద్దరూ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే ఉన్నారు. తాజాగా తన కొడుకు కోసం ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును హార్దిక్ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

రేట్ ఎంతంటే?

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన కొడుకు అగస్త్యకు ల్యాండ్ రోవర్ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ధర అక్షరాల నాలుగు కోట్ల రూపాయలు. ముంబైలోని షోరూమ్ లో అగస్త్య, అతని తల్లి నటాషా స్టాంకోవిచ్ కలిసి ఈ కారును తీసుకున్నారు. 5 ఏళ్ల అగస్త్య కారును చూసి ఆనందంలో మునిగిపోయాడు. ల్యాండ్ రోవర్ ముంబై తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పంచుకుంది.

‘‘మిస్టర్ హార్దిక్ పాండ్యా తన డిఫెండర్ కొనుగోలు కోసం మరోసారి నవ్నీత్ మోటార్స్‌ను ఎంచుకున్నారు. ఈ ల్యాండ్ రోవర్ ను ముంబైలో డెలివరీ చేశాం. అగస్త్య పాండ్య, నటాషా స్టాంకోవిచ్‌ దీన్ని తీసుకున్నారు’’ అని ల్యాండ్ రోవర్ ముంబై తన పోస్టులో పేర్కొంది.

హార్దిక్, నటాషా గురించి..

హార్దిక్, నటాషా మే 31, 2020న వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 14, 2023న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2024 జులైలో విడిపోతున్నట్లు ప్రకటించారు. ‘‘నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అని హార్దిక్ అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో అనౌన్స్ చేశాడు.

మహికా శర్మతో

హార్దిక్ పాండ్య ప్రస్తుతం మోడల్ మహికా శర్మతో డేటింగ్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆమె పుట్టిన రోజు సందర్భంగా రొమాంటిక్ ఫొటో, వీడియోను హార్దిక్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘‘హ్యాపీ బర్త్ డే మై ప్రిన్సెస్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More