మళ్లీ ప్రేమలో హార్దిక్ పాండ్య.. ఐ లవ్యూ పోస్ట్.. మహికా శర్మ రియాక్షన్ ఇదే.. బెస్ట్ గిఫ్ట్ అంటూ.. రొమాంటిక్ వీడియో వైరల్
ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ ప్రేమలో పడ్డాడు. గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో గడిపిన ఓ రొమాంటిక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఐ లవ్యూ అంటూ తన ప్రేయసిపై ప్రేమ కురిపించాడు. దీనికి మహికా రియాక్షన్ వైరల్ గా మారింది.
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ ప్రేమలో పడ్డాడు. అవును.. ఇది నిజమే. తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ 25వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెపై హార్దిక్ తన ప్రేమను కురిపించాడు. ప్రియురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ రొమాంటిక్ వీడియోను పోస్టు చేశాడు.

రొమాంటిక్ వీడియో
మహికా శర్మ 25వ పుట్టినరోజు సందర్భంగా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఆమె కోసం ఒక ప్రత్యేక పోస్ట్ షేర్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో మహికా, హార్దిక్ మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, కౌగిలించుకుంటూ, చేతులు పట్టుకుని బయట కూర్చున్నారు. వెనకాల బాణాసంచా వెలుగులు కనిపించాయి. వీడియో చివరిలో ఇద్దరూ గాలిలో ఎగిరే దీపాన్ని వదిలారు.
ఐ లవ్యూ
"హ్యాపీ బర్త్ డే మై ప్రిన్సెస్. 25 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తివి నువ్వే. ఐ లవ్యూ’’ అని హార్దిక్ ఈ వీడియోతో పాటు క్యాప్షన్ పోస్టు చేశాడు.
మహికా రియాక్షన్
ప్రియుడు హార్దిక్ పాండ్య ప్రేమ పట్ల మహికా శర్మ పొంగిపోయింది. ఆనందం పట్టలేని ఆమె.. "ఈ ఏడాది నువ్వే నా బెస్ట్ గిఫ్ట్" అని రియాక్టయింది. హార్దిక్ పాండ్య, మహికా మధ్య ప్రేమ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని రోజులు పబ్లిక్ గా బయటపడని వీళ్లు.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తమ రిలేషన్ షిప్ ను అనౌన్స్ చేసేశారు.
నెటిజన్లు ఏమన్నారంటే?
మహికా శర్మ బర్త్ డే సందర్భంగా హార్దిక్ ఫొటో, వీడియోలు పోస్టు చేయడంపై నెటిజన్లు రియాక్టవుతున్నారు. ‘‘బ్యూటీఫుల్ మూమెంట్స్’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. "మీరు ఇద్దరూ కలిసి అద్భుతంగా కనిపిస్తున్నారు" అని మరొకరు పేర్కొన్నారు. "క్యూట్ పోస్ట్, మంచి వ్యక్తులు" అని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఈ రొమాంటిక్ వీడియో కంటే ముందు స్విమ్మింగ్ పూల్ లో మహికాను హగ్ చేసుకున్న ఫొటోను హార్దిక్ పోస్టు చేసిన సంగతి తెలిసిందే.
హార్దిక్, మహికా గురించి
కొంతకాలంగా హార్దిక్ పాండ్య, మహికా రిలేషన్ షిప్ లో ఉన్నారు. డేటింగ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వాళ్లు ముంబైలో జరిగిన యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ ఈవెంట్‌కు కలిసి హాజరయ్యారు. గత సంవత్సరం అక్టోబర్‌లో మహికాతో తన రిలేషన్ షిప్ ను హార్దిక్ ధృవీకరించాడు. అంతకుముందు యూకే సింగర్ జాస్మిన్ వాలియాతో హార్దింగ్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. తర్వాత ఏమో వాళ్లు విడిపోయారని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని తెలిసింది.
నటాషాతో విడాకులు
హార్దిక్ అంతకుముందు నటి నటాషా స్టాంకోవిచ్ ను వివాహం చేసుకున్నాడు. వాళ్ల పెళ్లి 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో జరిగింది. వీళ్లకు ఒక కొడుకున్నాడు. అయితే గతేడాది హార్దిక్, నటాషా విడిపోయారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


