రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయొచ్చు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?
రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సైకో సయ్యా ఓటీటీలోకి వస్తోంది. దీనిని అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలు, ఇతర విశేషాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలోకి మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ 'సైకో సయ్యా' (Psycho Saiyaan) రాబోతోంది. రవి కిషన్, తేజస్వి ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రేమ ఎప్పుడు ఒక ప్రమాదకరమైన అబ్సెషన్ గా మారుతుందో ఇందులో చూపించనున్నారు.

సైకో సయ్యా వెబ్ సిరీస్ విశేషాలు
సాధారణ బాలీవుడ్ ప్రేమకథలకు భిన్నంగా, ఉత్కంఠభరితమైన అంశాలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'సైకో సయ్యా'. దీని ట్రైలర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. అజయ్ భుయాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 25 నుంచి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో అందుబాటులోకి రానుంది.
ఈ వెబ్ సిరీస్ లో రవి కిషన్, తేజస్వి ప్రకాష్, అనుద్ సింగ్ ధాకా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక యశ్‌పాల్ శర్మ, అశ్విని కాల్సేకర్, సుర్భి చందన, సృష్టి శ్రీవాస్తవ, వరుణ్ భగత్ లాంటి వాళ్లు కూడా నటించారు.
సైకో సయ్యా వెబ్ సిరీస్ కథేంటంటే..
కార్తీక్ పాండే (అనుద్ సింగ్ ధాకా) ఉజ్జయినికి చెందిన ఒక యువకుడు. సినిమాటిక్ మైండ్‌సెట్ ఉన్న ఇతనికి షాయరీలంటే ఇష్టం. చారు (తేజస్వి ప్రకాష్)ను చూసిన వెంటనే ఆమె తన డెస్టినీ అని నమ్ముతాడు. ఆమె పట్ల అతనికున్న ఆరాధన మెల్లగా ఒక మానసిక రుగ్మతలా, అదుపులేని పిచ్చిలా మారుతుంది.
చారు కోసం అతను ఉజ్జయిని, కట్ని వంటి చిన్న పట్టణాల నుంచి జార్జియా దేశం వరకు వెళ్తాడు. తమ బంధానికి అడ్డువచ్చే ఎవరినైనా ఎదిరిస్తాడు. ఈ కథలో రవి కిషన్ 'హంట్రీ చౌహాన్' అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో, కథను మలుపు తిప్పే రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు.
తేజస్వి ప్రకాష్ ఓటీటీ డెబ్యూ..
టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన తేజస్వి ప్రకాష్.. ఈ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలోకి నటిగా అడుగుపెడుతోంది. "నా ఓటీటీ ఎంట్రీకి ఇలాంటి లేయర్స్ ఉన్న పాత్ర దొరకడం నా అదృష్టం. బయటకు అంతా బాగున్నట్లు కనిపించే చారు జీవితంలో జరిగే అనూహ్య పరిణామాలు, భయం చాలా ఆసక్తికరంగా ఉంటాయి" అని ఆమె తెలిపింది.
హీరో అనుద్ సింగ్ మాట్లాడుతూ.. "ప్రేమకు హద్దులు లేకపోతే అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇందులో చూస్తారు. అది ఒక భక్తిలా మొదలై, చివరికి ఒక పెద్ద ఘటనగా ఎలా మారుతుందో ఇందులో చూపించాం" అని పేర్కొన్నాడు. రవి కిషన్ కూడా తన పాత్ర చాలా అనూహ్యంగా ఉంటుందని, పవర్ ను ఆస్వాదించే వ్యక్తిగా కనిపిస్తానని చెప్పాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


