ఓటీటీలో ఈవారం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో చూడాల్సిన 6 ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే

ఓటీటీలోకి ఈవారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల కంటెంట్ ఉంది. మరి వీటిలో చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఏవో చూడండి.

Published on: Feb 18, 2026, 15:48:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈవారం ఓటీటీ ప్రియులకు వినోదాల విందు దొరకనుంది. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్ట్స్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. 'లక్కీ ది సూపర్ స్టార్' నుంచి మమ్ముట్టి 'చాతా పాచా' వరకు ఈ వారం విడుదలయ్యే సినిమాల వివరాలు ఇక్కడ చూడండి.

ఓటీటీలో ఈవారం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో చూడాల్సిన 6 ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే (JioHotstar/ Netflix)
ఓటీటీలో ఈవారం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో చూడాల్సిన 6 ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే (JioHotstar/ Netflix)

ఈవారం ఓటీటీ రిలీజెస్

ఈ వారం సౌత్ ఇండియన్ సినిమాల ఓటీటీ రిలీజ్ లైనప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫిబ్రవరి 19 (గురువారం) నుంచే కొత్త సినిమాలు అందుబాటులోకి రానున్నాయి.

శ్రీ చిదంబరం గారు - ఈటీవీ విన్

రిలీజ్ తేదీ: ఫిబ్రవరి 19

తెలుగు సినిమా శ్రీ చిదంబరం గారు ఓటీటీలోకి వస్తోంది. ఒక యువకుడు తన గతం తాలూకు అవమానంతో, వేరే పేరుతో బతుకుతుంటాడు. ప్రేమ, బాధ, ధైర్యం ద్వారా తన నిజమైన అస్తిత్వాన్ని ఎలా తెలుసుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. తులసి, వంశీ తుమ్మల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈటీవీ విన్ ఓటీటీలో గురువారం అంటే ఫిబ్రవరి 19 నుంచి చూడొచ్చు.

చాతా పాచా - నెట్‌ఫ్లిక్స్

రిలీజ్ తేదీ: ఫిబ్రవరి 19

ఇదో మలయాళ మూవీ. కొచ్చిలో డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) స్ఫూర్తితో ముగ్గురు స్నేహితులు అండర్ గ్రౌండ్ రెజ్లింగ్ మొదలుపెడతారు. చిన్ననాటి పిచ్చి నుంచి లోకల్ మ్యాచ్‌ల వరకు వారి ప్రయాణం, గొడవలు, డ్రామా ఇందులో ఉంటాయి. అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, మమ్ముట్టి నటించారు. నెట్‌ఫ్లిక్స్ లో గురువారం అంటే ఫిబ్రవరి 19 నుంచి చూడొచ్చు.

లక్కీ ది సూపర్ స్టార్ - జియోహాట్‌స్టార్

రిలీజ్ తేదీ: ఫిబ్రవరి 20

ఇదో తమిళ ఫ్యామిలీ డ్రామా. ఇది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్. తప్పిపోయిన ఒక కుక్కపిల్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రాజకీయ గొడవల్లో చిక్కుకున్న ఒక పిల్లాడికి ఈ కుక్కపిల్ల ఎలా సహాయం చేసిందనేది ఆసక్తికరం. జీవీ ప్రకాష్ కుమార్, అనస్వర రాజన్, కోవై సరళ ఇందులో నటించారు. ఫిబ్రవరి 20 నుంచి జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.

అమోస్ అలెగ్జాండర్ - సన్ నెక్ట్స్

రిలీజ్ తేదీ: ఫిబ్రవరి 20

ఇది కూడా ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ట్రూ క్రైమ్ షోను నడిపే ఒక జర్నలిస్ట్ జంట, ఒక రేపిస్ట్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తారు. ఆ నేరస్తుడు చెప్పే నమ్మలేని నిజాలు, ఆ జంటకు ఉన్న లింక్ బయటపడటంతో కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. జాఫర్ ఇడుక్కి, అజు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 20 నుంచి సన్ నెక్ట్స్ లో చూడొచ్చు.

రాక్షస - జీ5

రిలీజ్ తేదీ: ఫిబ్రవరి 20

ఇదొక కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఘటప్రభ నది ఒడ్డున జరిగే కొన్ని భయానక సంఘటనల మిస్టరీ ఇది. ఎస్ఐ హన్మప్ప (విజయ్ రాఘవేంద్ర) ఈ కేసును ఛేదించే క్రమంలో నమ్మకాలు, ఆచారాలు, సాక్ష్యాల మధ్య నలిగిపోతాడు. న్యాయం, సానుభూతికి మధ్య ఉన్న సన్నని గీతను ఈ సిరీస్ చూపిస్తుంది. ఫిబ్రవరి 20 నుంచి జీ5 ఓటీటీలో చూడొచ్చు.

నీలి హక్కి - సన్ నెక్ట్స్

రిలీజ్ తేదీ: ఫిబ్రవరి 20

ఇది కూడా ఓ కన్నడ మూవీ. సిద్దా అనే 10 ఏళ్ల పిల్లాడు పల్లెటూరు నుంచి సిటీకి వలస వచ్చినప్పుడు పడే మానసిక సంఘర్షణే ఈ సినిమా. కొత్త వాతావరణంలో ఇమడలేక, తన బాల్యాన్ని వదులుకోలేక ఆ పిల్లాడు పడే ఆవేదనను ఇందులో చూపించారు. ఫిబ్రవరి 20 నుంచి సన్ నెక్ట్స్ లో చూడొచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More