బ‌ట్ట‌లు లేకుండా స్విమ్మింగ్ పూల్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్‌గా హార్దిక్ పాండ్య‌-ప్రిన్సెస్ అంటూ బ‌ర్త్‌డే విషెస్‌

స్టేడియంలో ధనాధన్ షాట్లతో అలరించే టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యలో ఓ రొమాంటిక్ పర్సన్ కూడా ఉన్నాడు. బట్టలు లేకుండా తన గర్ల్ ఫ్రెండ్ మహికాతో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫొటోను హార్దిక్ పోస్టు చేశాడు. తన ప్రియురాలుకు ప్రేమతో కూడిన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. 

Published on: Feb 19, 2026, 11:22:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓ వైపు ఆటతో గ్రౌండ్ లో అదరగొడుతున్న హార్దిక్ పాండ్య.. మరోవైపు గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో రొమాంటిక్ గానూ గడుపుతున్నాడు. తాజాగా మహికా శర్మతో చాలా క్లోజ్ గా, బట్టలు లేకుండా ఉన్న రొమాంటిక్ ఫొటోను హార్దిక్ పాండ్య షేర్ చేశాడు. తన ప్రియురాలు మహికా శర్మకు బర్త్ డే విషెస్ చెప్తూ హార్దిక్ ఈ ఫొటో పంచుకున్నాడు. ఇప్పుడు ఇది తెగ వైరల్ గా మారింది.

మహికాతో హార్దిక్ పాండ్య
మహికాతో హార్దిక్ పాండ్య

హార్దిక్, మహికా రొమాన్స్

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య కేవలం మైదానంలో తన ఆటతీరుతోనే కాకుండా, వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. గడిచిన ఏడాది కాలంగా ఈ స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, మోడల్ మహికా శర్మ రిలేషన్ షిప్ గురించి రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. రొమాంటిక్ వెకేషన్ల నుంచి ప్రొఫెషనల్ మీట్ వరకు వీళ్లిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఫొటో వైరల్

తన ప్రియురాలు మహికా శర్మకు బర్త్ డే విషెస్ చెప్తూ హార్దిక్ పాండ్య పోస్ట్ చేసిన పిక్ తెగ వైరల్ గా మారింది. స్విమ్మింగ్ పూల్ లో ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న హార్దిక్ రొమాంటిక్ గా మహికాను కౌగిలించుకున్నాడు. ఈ రొమాంటిక్ ఫొటో వీళ్ల ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని చాటుతోంది. "హ్యాపీ బర్త్ డే మై ప్రిన్సెస్’’ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో హార్దిక్ పోస్టు చేశాడు.

హార్దిక్ పాండ్య స్టోరీ
హార్దిక్ పాండ్య స్టోరీ

మహికాతో డేటింగ్

కొంతకాలంగా మోడల్ మహికాతో హార్దిక్ పాండ్య డేటింగ్ లో ఉన్నాడు. టీమిండియా క్రికెట్ జట్లకు బీసీసీఐ సత్కార కార్యక్రమంలో హార్దిక్, మహికా కలిసే కనిపించారు. దీంతో వీళ్ల రిలేషన్ షిప్ తొలిసారి అఫీషియల్ గా బయటకొచ్చింది. అప్పటి నుంచి వీళ్లు కలిసే ఉంటున్నారని తెలిసింది.

మహికాతో డేటింగ్ చేయడానికి ముందు నటి నటాషా స్టాంకోవిచ్ ను హార్దిక్ పాండ్య పెళ్లి చేసుకున్నాడు. 2020లో వీళ్ల వివాహం జరిగింది. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు. కానీ హార్దిక్, నటాషా 2025లో విడిపోయారు.

టీ20 ప్రపంచకప్

హార్దిక్ పాండ్య ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ లో ఇండియాకు ఆడుతున్నాడు. పాకిస్థాన్ పై బౌలింగ్ లో సత్తాచాటి రెండు వికెట్లు తీశాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత టీమ్ లోనూ హార్దిక్ ఉన్నాడు. ఆ తర్వాత టీమ్ తో కలిసి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో టీ20 వరల్డ్ కప్ టైటిల్ పై కన్నేశాడు. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More