గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026: ప్రపంచంలోనే టాప్ 10 బిజినెస్ స్కూల్స్ ఇవి..
విదేశాల్లో ఎంబీఏ చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! క్యూఎస్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026 లిస్ట్ మీకు ఒక స్పష్టమైన మార్గదర్శిగా నిలుస్తుంది. ఈ ఏడాది టాప్ 10 బిజినెస్ స్కూల్స్ లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
మీరు ఎంబీఏ డిగ్రీకి ఉన్న అంతర్జాతీయ విలువ, అధిక వేతనాల ఉద్యోగాలు, వృత్తిపరమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విదేశాల్లో ఎంబీఏ చదవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ స్కూల్స్‌ను అత్యంత విశ్వసనీయంగా అంచనా వేసే సంస్థల్లో ఒకటైన క్యూఎస్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026 మీకోసం ఒక స్పష్టమైన, ప్రామాణికమైన మార్గదర్శిని అందిస్తోంది.

ప్రపంచంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ప్రవేశం కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ ర్యాంకింగ్స్ ఎంతో ఉపకరిస్తాయి. ఈ ర్యాంకింగ్స్ విడుదల చేయడానికి, క్యూఎస్ సంస్థ ముఖ్యంగా 'థాట్ లీడర్‌షిప్', 'రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ఆర్‌ఓఆ)', 'ఉద్యోగ లభ్యత', 'ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పూర్వ విద్యార్థుల ఫలితాలు', 'వైవిధ్యం' వంటి కీలక సూచికల ఆధారంగా యూనివర్సిటీలను అంచనా వేస్తుంది. తద్వారా అభ్యర్థులు దేశంలో, విదేశాల్లో తమ కెరీర్‌కు సరైన సంస్థను ఎంచుకోవడానికి వీలవుతుంది.
హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లను అధిగమించి.. వార్టన్ అగ్రస్థానం!
ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన "ది వార్టన్ స్కూల్" అగ్రస్థానంలో నిలిచింది. ఇది మొత్తం 100/100 స్కోరును సాధించి, అసాధారణమైన ప్రదర్శన కనబరిచింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో వార్టన్, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలను కూడా అధిగమించింది!
వార్టన్ సాధించిన కీలక సూచికల స్కోర్లు:
థాట్ లీడర్‌షిప్: 96.8
రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్: 96.1
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ పూర్వ విద్యార్థుల ఫలితాలు: 85.3
ఉద్యోగ లభ్యత: 98.8
వైవిధ్యం: 77.3
ఇతర టాప్ బిజినెస్ స్కూల్స్ ర్యాంకింగ్స్..
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మొత్తం 99.6 స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీని స్కోర్లు:
థాట్ లీడర్‌షిప్ - 96.7
రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ - 91.8
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ పూర్వ విద్యార్థుల ఫలితాలు - 98.3
ఉద్యోగ లభ్యత - 96.6
వైవిధ్యం - 72.7
ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్. మొత్తం 99.4 స్కోరుతో మూడవ ర్యాంకులో నిలిచింది. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 99.0 స్కోరుతో నాల్గొవ స్థానంలో ఉంది.
98.8 స్కోరుతో హెచ్ఈసీ ప్యారిస్ (ఫ్రాన్స్) ఐదొవ స్థానం, 97.6 స్కోరుతో లండన్ బిజినెస్ స్కూల్ (యూకే) ఆరొవ స్థానం, 97 స్కోరుతో కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ (యూకే) 7వ స్థానాన్ని దక్కించుకున్నాయి. 8, 9, 10వ స్థానాల్లో వరసగా ఇన్సీడ్ (సింగపూర్/ ఫ్రాన్స్- 96.9), నార్త్‌వెస్టర్న్ కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (యూఎస్ఏ- 96.7), కొలంబియా బిజినెస్ స్కూల్ (యూఎస్ఏ- 96.1) వంటివి ఉన్నాయి.
క్యూఎస్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026 ప్రధాన లక్ష్యం విద్యార్థులు మేనేజ్‌మెంట్ విద్య గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటమే! ఈ జాబితాలో ఉన్న స్కూల్స్ గ్రాడ్యుయేట్లను అధిక వేతనాల ఉద్యోగాలకు, పారిశ్రామికవేత్తలుగా మారడానికి, అంతర్జాతీయ మార్కెట్లో నాయకత్వ పాత్రలు పోషించడానికి ఎలా సిద్ధం చేస్తున్నాయో హైలైట్ చేస్తుంది.














