సూపర్ ఐడియా సర్ జీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో హిస్టరీ షీటర్లు!
ఒకప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన హిస్టరీ షీటర్లు ఇప్పుడు ట్రాఫిక్ విధుల్లో పాల్గొంటున్నారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా మేనేజ్‌మెంట్ చేస్తున్నారు.
రాచకొండ పోలీసులు కమిషనరేట్‌లోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ నిర్వహణ విధుల్లో హిస్టరీ-షీటర్లను(ఒకప్పుడు రౌడీ షీటర్లు) చేర్చే ఒక వినూత్నమైన సంస్కరణ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం నేరాలు వదిలి జనంలో ఉంటున్న వారిని సమాజ సేవలో పాల్గొనడానికి, వారిని చూసి ఎవరూ భయపడకుండా ఉండేందుకు ప్రోత్సహిస్తుంది. స్థిరమైన సానుకూల ప్రవర్తన, మార్పు, సంస్కరణలను అంగీకరించడానికి సుముఖత చూపిన హిస్టరీ-షీటర్లను గుర్తించి రద్దీగా ఉండే ట్రాఫిక్ పాయింట్ల వద్ద నియమించారు.

ఉప్పల్, ఎల్బీ నగర్, ECIL వంటి ప్రధాన జంక్షన్లలో హిస్టరీ షీటర్లు, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి పనిచేశారు. వాహనాల కదలికను నిర్వహించడంలో, ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడ్డారు. ఈ కార్యక్రమంపై కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమం అర్థవంతమైన మార్పును సృష్టించడం, ఒకప్పుడు నేరాలతో ముడిపడి ఉన్న వ్యక్తులను సమాజ సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ గతాన్ని సరిదిద్దుకుని ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
తాము తమ తప్పులను గుర్తుంచుకుంటామని, కానీ ఇప్పుడు ప్రజలకు సహాయం చేయడం ఆనందంగా అనిపిస్తుందని ఓ హిస్టరీ షీటర్ తెలిపారు.
కుషాయిగూడ డివిజన్‌లో మాత్రమే 20 మంది హిస్టరీ-షీటర్లు ట్రాఫిక్ అవగాహన, నియంత్రణ కార్యకలాపాలలో పోలీసులకు మద్దతు ఇచ్చారు. ఉప్పల్, ఎల్బీ నగర్ లాంటి ఏరియాల్లో కూడా ఇలాంటి భాగస్వామ్యం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ నుండి 20 మంది హిస్టరీ షీటర్లు ట్రాఫిక్ విభాగంతో చేతులు కలిపారు.
సంస్కరణలో భాగంగా సత్ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్లను ఎంపిక చేశారు. నిర్మాణాత్మక పాత్రల్లోకి చేర్చడానికి సంస్కరణ కార్యక్రమాలను మరిన్ని ప్లాన్ చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. కేవలం అమలు చేయడమే కాకుండా సమాజాన్ని సానుకూల మార్పు వైపు నడిపించడమే లక్ష్యమన్నారు.
ఇందులో చాలా మంది ఒకప్పుడు అనుకోని పరిస్థితుల్లో నేరాలకు పాల్పడీ రౌడీ షీటర్ల ముద్ర వేసుకున్నారు. కానీ చాల మంది మారిపోయి ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. వారిలో వచ్చిన మార్పులను చూసిన రాచకొండ కమిషనర్ ప్రజాలకు సేవ చేసేందుకు తీసుకువస్తున్నారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో పాల్గొనేలా చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


