హైదరాబాద్‌ టూ వరంగల్ ప్రయాణం ఈజీ.. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌పై గుడ్‌న్యూస్!

ఉప్పల్ టూ నారపల్లి రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ రూట్ గురించి తాజాగా ఓ గుడ్‌న్యూస్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Published on: Nov 19, 2025, 21:58:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉప్పల్ నుంచి నారపల్లి వైపు రావాలంటే ఆ ప్రయాణం ఎంత నరకమో చాలా మందికి తెలుసు. వరంగల్ వైపు వెళ్లేవారు ఈ దారి ఎప్పుడు అయిపోతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అంతలా రోడ్డు అధ్వాన్నంగా ఉంటుంది. ఈ దారిలో వెళ్తుంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తాయనేది నిజం. దీనిపై సోషల్ మీడియాలోనూ విపరీతమైన ట్రోల్స్ ఉన్నాయి. దారంతా గుంతలు, పైకి ఎగిరే దుమ్ముతో ఈ రూట్‌లో ప్రయాణించేందుకు భయపడుతుంటారు జనాలు.

ఉప్పల్-నారపల్లి రూట్‌లో జరుగుతున్న పనులు
ఉప్పల్-నారపల్లి రూట్‌లో జరుగుతున్న పనులు

అయితే తాజాగా ఈ రూట్లలో ఫ్లైఓవర్ వర్క్స్ కూడా కాస్త త్వరగా చేస్తున్నారు. ఉప్పల్ నుంచి కూడా కొంత దూరం రోడ్డు వేశారు. ఇప్పుడు ఈ రూట్ మీద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్డేట్ ఇచ్చారు. ఉప్పల్ దారిలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మెుదలుపెట్టామని కోమటిరెడ్డి చెప్పారు. 5.5 కి.మీ గానూ 1.5 కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తైందన్నారు. మేడారం జాతర ప్రారంభం వరకు నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

'ఉప్పల్ వరంగల్ మార్గంలో మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. రోడ్డు పనులు, ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరత్వరగా నడుస్తున్నాయి. 2026నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేస్తాం. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిర్మాణం ఆపే ప్రసక్తి లేదు.' అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

మేడారం జాతర ప్రారంభమయ్యే సమయానికి బీటీ రోడ్డు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 2026 దసరా వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభిస్తామన్నారు.

ఉప్పల్-వరంగల్ హైవేపై ఉప్పల్-మేడిపల్లి మధ్య ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి భారత్‌మాల పథకం కింద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ 2018 మేలో ఈ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. 2020 జూన్ వరకు నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ పనులు నత్తనడక సాగి.. ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణ పనులతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఉప్పల్ నుంచి దాదాపు నారపల్లి వరకూ రోడ్డుపై ప్రయాణం నరకంలా ఉంటుంది. అయితే తాజాగా అధికారులు రోడ్లకు రిపేర్లతోపాటుగా ఫ్లైఓవర్ పనులు చేస్తున్నారు. ఇది త్వరగా అందుబాటులోకి రావాలని జనాలు కోరుకుంటున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More