ఆటోమొబైల్ విడిభాగాల తయారీ దిగ్గజం 'హీరో మోటార్స్ లిమిటెడ్' ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాదితో పోలిస్తే రెట్టింపునకు పైగా నమోదైంది. ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వెలువడటంతో బుధవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో హీరో మోటార్స్ షేరు ధర దాదాపు 6.5 శాతానికి పైగా ఎగబాకింది.
నికర లాభం రూ.10.2 కోట్లు

జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి హీరో మోటార్స్ ఆర్థిక ఫలితాలను మంగళవారం వెల్లడించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా రూ.10.2 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సాధించిన రూ.4.73 కోట్లతో పోలిస్తే ఇది 115 శాతానికి పైగా పెరుగుదల.
కంపెనీ ఆపరేషనల్ రాబడి సైతం గత ఏడాది సాధించిన రూ.255.7 కోట్ల నుంచి 24.9 శాతం పెరిగి రూ.319.3 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం (ఈబీఐటీడీఏ) 92 శాతం పెరిగి రూ.18.7 కోట్ల నుంచి రూ.35.9 కోట్లకు ఎగబాకింది. దీంతో ఈబీఐటీడీఏ మార్జిన్ 7.3 శాతం నుంచి 11.3 శాతానికి విస్తరించి ఆపరేషనల్ సామర్థ్యాన్ని నిరూపించింది.
హ్యూలాండ్ ఇంజనీరింగ్‌లో 90% వాటా
ఫలితాలతో పాటు మరో కీలక ప్రకటనను హీరో మోటార్స్ చేసింది. తమ అనుబంధ సంస్థ అయిన 'హ్యూలాండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్' (HEL) లో అదనంగా 39 శాతం వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత వాటాదారులు విలియం హ్యూలాండ్, సియోభాన్ హ్యూలాండ్ల నుంచి దాదాపు 0.60 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.6.5 కోట్లు) నగదు చెల్లించి ఈ వాటాను దక్కించుకోనుంది.
ఈ లావాదేవీ ద్వారా ఒక్కొక్కటి £1 ముఖ విలువ కలిగిన 8,039 ఈక్విటీ షేర్లను కంపెనీ సొంతం చేసుకుంటుంది. దీనితో హ్యూలాండ్ ఇంజనీరింగ్‌లో హీరో మోటార్స్ వాటా 51 శాతం నుంచి 90 శాతానికి పెరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుందని, దీనికి ప్రభుత్వ లేదా నియంత్రణ సంస్థల ఆమోదాలు అవసరం లేదని తెలిపింది.
అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలకు సరఫరా
హీరో మోటార్స్ గ్లోబల్ ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీగా గుర్తింపు పొందింది. అమెరికా, యూరప్, భారత్, ఆసియాన్ (ASEAN) ప్రాంతాల్లోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులకు (OEMs) పవర్‌ట్రెయిన్ సొల్యూషన్లను ఈ సంస్థ డిజైన్ చేసి సరఫరా చేస్తుంది. ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, ఆఫ్‌రోడ్ వాహనాలు, ఈవీ కార్లు, హైబ్రిడ్ వాహనాలు, భారీ మోటారు వాహనాలకు కావలసిన విడిభాగాలను ఇది తయారు చేస్తుంది. బీఎమ్‌డబ్ల్యూ (BMW), డుకాటి (Ducati), ఎన్వియోలో (Enviolo), ఫార్ములా మోటార్‌స్పోర్ట్, హమ్మింగ్‌బర్డ్ ఈవీ, హెచ్‌డబ్ల్యూఏ (HWA) వంటి అంతర్జాతీయ సంస్థలు హీరో మోటార్స్ క్లయింట్ల జాబితాలో ఉన్నాయి.
షేరు ధర దూకుడు
{{/usCountry}}హీరో మోటార్స్ గ్లోబల్ ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీగా గుర్తింపు పొందింది. అమెరికా, యూరప్, భారత్, ఆసియాన్ (ASEAN) ప్రాంతాల్లోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులకు (OEMs) పవర్‌ట్రెయిన్ సొల్యూషన్లను ఈ సంస్థ డిజైన్ చేసి సరఫరా చేస్తుంది. ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, ఆఫ్‌రోడ్ వాహనాలు, ఈవీ కార్లు, హైబ్రిడ్ వాహనాలు, భారీ మోటారు వాహనాలకు కావలసిన విడిభాగాలను ఇది తయారు చేస్తుంది. బీఎమ్‌డబ్ల్యూ (BMW), డుకాటి (Ducati), ఎన్వియోలో (Enviolo), ఫార్ములా మోటార్‌స్పోర్ట్, హమ్మింగ్‌బర్డ్ ఈవీ, హెచ్‌డబ్ల్యూఏ (HWA) వంటి అంతర్జాతీయ సంస్థలు హీరో మోటార్స్ క్లయింట్ల జాబితాలో ఉన్నాయి.
షేరు ధర దూకుడు
{{/usCountry}}ఫలితాల నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) లో హీరో మోటార్స్ షేరు క్రితం ముగింపు రూ.155.19 తో పోలిస్తే రూ.161 వద్ద గ్యాప్-అప్‌తో ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో రూ.167.39 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.