పండుగ సీజన్‌ను పురస్కరించుకుని భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేయడానికి హోండా కార్స్ ఇండియా సిద్ధమైంది. మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ప్రజాదరణ పొందిన ‘హోండా ఎలివేట్’కి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అక్టోబర్ మొదటి వారంలో లాంచ్ చేయడానికి కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

దసరా, దీపావళి పండుగల సమయంలో కొత్త కార్ల కొనుగోలుకు తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా కస్టమర్లు ఆసక్తి చూపుతారు. ఈ కొనుగోలు జోరును ఆసరాగా చేసుకుని అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా హోండా ముందుకు సాగుతోంది.
హుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి దిగ్గజ ఎస్‌యూవీల పోటీని తట్టుకునేందుకు హోండా ఈ మోడల్‌ను సరికొత్త రూపురేఖలు, అదనపు ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో 2026 హోండా ఎలివేట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2026 హోండా ఎలివేట్- ఎక్స్‌టీరియర్ డిజైన్..
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ వెలుపలి రూపంలో కొన్ని స్పష్టమైన మార్పులు చేర్చారు. కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, అధునాతన 2డీ హోండా లోగో, సరికొత్త అల్లాయ్ వీల్స్ ఈ కార్‌కి మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి. హెడ్‌లైట్లు, టెయిల్ లైట్ల ఎల్ఈడీ ఎలిమెంట్లను కూడా అప్‌డేట్ చేశారు. కొన్ని కొత్త రంగుల ఆప్షన్లను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ మార్పులు కారుకు మరింత ట్రెండీ లుక్‌ని ఇస్తాయి.
2026 హోండా ఎలివేట్- కేబిన్..
ఇప్పటివరకు ఉన్న హోండా ఎలివేట్ మోడల్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండేవి. అయితే మిడ్‌సైజ్ ఎస్‌యూవీ రేసులో ప్రత్యర్థుల కంటే ముందుండటానికి హోండా ఈసారి మరింత లగ్జరీ ఫీచర్లను జోడిస్తోంది.
కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లను చేర్చబోతున్నారు.
{{/usCountry}}కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లను చేర్చబోతున్నారు.
{{/usCountry}}ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ తరహాలోనే ఎలివేట్‌లోనూ 10.1-అంగుళాల స్క్రీన్ లేదా 360-డిగ్రీ కెమెరాను పొందుపరిచే అవకాశం ఉంది.
2026 హోండా ఎలివేట్- ఇంజిన్..
మెకానికల్ పరంగా హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదు! ఇప్పటికే ఉన్న నమ్మకమైన 1.5-లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను దీనిలోనూ కొనసాగిస్తున్నారు. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. హోండా సిటీలో ఉన్నటువంటి ‘సిటీ ఈ:హెచ్‌ఈవీ’ స్ట్రాంగ్-హైబ్రిడ్ టెక్నాలజీని ఎలివేట్‌లో ఆశించినప్పటికీ, ఈ అప్‌డేట్‌లో హైబ్రిడ్ వెర్షన్‌ను పరిచయం చేయడం లేదని సమాచారం.
2026 హోండా ఎలివేట్- ధర..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా ఎలివేట్ ప్రారంభ ధర రూ. 11.81 లక్షల నుండి రూ. 16.78 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బేస్ మోడల్ ప్రారంభ ధరను పాత ధరకు దరిదాపుల్లోనే ఉంచాలని హోండా భావిస్తోంది. అయితే పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు ఉండే టాప్ వేరియంట్ల ధరలు రూ. 15,000 నుంచి రూ. 30,000 వరకు పెరిగే అవకాశం ఉంది.
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌తో సెడాన్ సెగ్మెంట్‌లో మంచి ఆదరణ పొందిన కంపెనీ, ఇప్పుడు ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ద్వారా పండుగ సీజన్ సేల్స్‌లో రికార్డులు సృష్టించాలని భావిస్తోంది.