...
...
Next Story

Honda Rebel 500 : ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా రెబెల్ 500 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా

ప్రీమియం క్రూయిజర్ బైక్ ప్రియుల కోసం హోండా కొత్త బైక్​ని తీసుకొచ్చింది. దాని పేరు హోండా రెబెల్ 500. ఈ బైక్​ని రూ. 4.49 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్లో విడుదల చేసింది. క్లచ్ వాడకుండానే గేర్లు మార్చే ఈ-క్లచ్ టెక్నాలజీతో వస్తున్న ఈ బైక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 20, 2026, 05:59:09 IST
Advertisement

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భారత ప్రీమియం బైక్ మార్కెట్లో మరో సంచలనానికి తెరతీసింది. ఎంతో కాలంగా బైక్ ప్రియులు ఎదురుచూస్తున్న ‘హోండా రెబెల్ 500’ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం దీని ప్రారంభ ధరను రూ. 4.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు అధునాతన ఈ-క్లచ్ వేరియంట్‌ను కూడా హోండా అందుబాటులోకి తెచ్చింది; ఈ-క్లచ్ మోడల్ ధర రూ. 4.89 లక్షలుగా ఉంది.

హోండా రెబెల్ 500
హోండా రెబెల్ 500

దేశవ్యాప్తంగా ఈ హోండా కొత్త బైక్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు కేవలం రూ. 5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి హెచ్​ఎంఎస్​ఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా గానీ, అధీకృత 'హోండా బిగ్‌వింగ్' డీలర్‌షిప్‌ల వద్ద గానీ బైక్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. సంస్థ ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ అయిన బిగ్‌వింగ్ ద్వారా మాత్రమే ఈ బైక్ విక్రయాలు, డెలివరీలు జరుగుతాయి. తెలుగు

రెండు వేరియంట్లు.. ఆకర్షణీయ రంగుల్లో అందుబాటు!

హోండా రెబెల్ 500 మోటార్ సైకిల్ స్టాండర్డ్, ఈ-క్లచ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు మోడళ్లు ‘మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్’, 'మ్యాట్ డ్యూన్ బ్రౌన్' అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది జులైలో తమ ఉత్పత్తుల శ్రేణిని 10 కొత్త మోడళ్లకు విస్తరిస్తున్నట్లు ప్రకటించిన సమయంలోనే హోండా ఈ బైక్‌ను తొలిసారి ప్రదర్శించింది. ఈ బైక్‌ను భారత్‌లోనే తయారు చేయడం ద్వారా దేశీయ తయారీ సామర్థ్యాన్ని సంస్థ మరింత బలోపేతం చేసుకుంది.

శక్తిమంతమైన 471సీసీ ఇంజిన్.. క్లచ్ లేకుండానే గేర్లు!

హోండా రెబెల్ 500 బైక్​లో 471 సీసీ, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ పవర్‌ట్రెయిన్ 8,500 ఆర్‌పీఎం వద్ద 45.6 బీహెచ్‌పీ పవర్​ని, 6,000 ఆర్‌పీఎం వద్ద 43.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నేలకు దగ్గరగా ఉండే ‘లో-స్లంగ్’ డిజైన్, మినిమలిస్ట్ స్టైలింగ్‌తో ఈ క్రూయిజర్ చూడగానే ఆకట్టుకుంటుంది. నగర ట్రాఫిక్‌లో రోజువారీ ప్రయాణాలతో పాటు సుదీర్ఘ హైవే ప్రయాణాలకు అనువుగా హోండా దీన్ని తీర్చిదిద్దింది.

ఫీచర్ల పరంగానూ హోండా ఎక్కడా రాజీ పడలేదు. రెబెల్ 500 ముందుభాగంలో ప్రకాశవంతమైన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ అందించారు. రైడర్ సమాచారం కోసం ‘హోండా రోడ్‌సింక్’ కనెక్టివిటీతో కూడిన ఆధునిక టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేను అమర్చారు. ఈ సిస్టమ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వెనుక చక్రం జారిపోకుండా ట్రాక్షన్‌ను నియంత్రించేందుకు 'హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్' ఫీచర్‌ను జతచేశారు.

భద్రత కోసం బైక్ ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వ్యవస్థను అందించారు. రెబెల్ 500 రాకతో భారత బిగ్‌వింగ్ శ్రేణిలో హోండా తన మిడ్-కెపాసిటీ మోటార్ సైకిళ్ల విభాగాన్ని మరింత విస్తరించింది. సంప్రదాయ మాన్యువల్ క్లచ్ ఇష్టపడే వారితో పాటు ఆధునిక ఈ-క్లచ్ టెక్నాలజీ కోరుకునే రైడర్లకు ఈ రెండు వేరియంట్లు చక్కటి ఎంపికగా నిలుస్తాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks