ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ, తన తండ్రి అయతొల్లా అల్ ఖమేనీని బలిగొన్న ఇజ్రాయెల్ క్షిపణి దాడి నుంచి సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నారని తాజాగా లీకైన ఒక ఆడియో నివేదిక సంచలనం సృష్టిస్తోంది. క్షిపణులు భవనాన్ని తాకడానికి కేవలం కొన్ని క్షణాల ముందే ఆయన కాంపౌండ్ నుంచి బయటకు వెళ్లడం వల్ల మృత్యువు నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ: దాడి జరిగిన తీరు ఇది..

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా టెహ్రాన్‌లోని ఖమేనీ నివాస సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్‌తో పాటు పలువురు సీనియర్ అధికారులు, కుటుంబ సభ్యులు మరణించారు.
అనంతరం, మార్చి 12న సీనియర్ ఇరాన్ మతగురువులు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్ల మధ్య జరిగిన అంతర్గత సమావేశానికి సంబంధించిన ఆడియో ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది.
‘దైవ సంకల్పమే కాపాడింది!’
దివంగత నేత కార్యాలయ ప్రోటోకాల్ హెడ్ మజాహర్ హొస్సేని ఆ సమావేశంలో మాట్లాడుతూ.. దాడికి కొద్దిసేపటి ముందే మోజ్తబా తన తండ్రితో కలిసి అదే భవనంలో ఉన్నారని వెల్లడించారు.
"మోజ్తబా ఏదో పని మీద పెరట్లోకి వెళ్లి తిరిగి రావాలనేది దేవుడి సంకల్పం. ఆయన బయటకు వచ్చి తిరిగి మెట్లు ఎక్కుతున్న సమయంలోనే క్షిపణి భవనాన్ని తాకింది," అని హొస్సేని ఆ రికార్డింగ్‌లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రయోగించిన ‘బ్లూ స్పారో’ బాలిస్టిక్ క్షిపణులు వరుసగా సముదాయాన్ని ధ్వంసం చేశాయి.
మరణించిన వారు- దాడి తీవ్రత..
హొస్సేని వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం మూడు క్షిపణులతో దాడి జరిగింది.
మొదటి క్షిపణి అయతొల్లా అల్ ఖమేనీ ఉన్న విభాగాన్ని తాకి ఆయనను హతమార్చింది.
{{/usCountry}}మొదటి క్షిపణి అయతొల్లా అల్ ఖమేనీ ఉన్న విభాగాన్ని తాకి ఆయనను హతమార్చింది.
{{/usCountry}}రెండో క్షిపణి పై అంతస్తులో ఉన్న మోజ్తబా ఖమేనీ నివాసంపై పడింది. ఈ దాడిలో మోజ్తబా భార్య హద్దాద్ అక్కడికక్కడే మరణించారు.
మూడో క్షిపణి ఆయన బావమరిది మిస్బా అల్-హుదా బాఘేరీ కానీ ఇంటిని తాకింది. ఈ పేలుడు తీవ్రతకు ఆయన తల రెండుగా చీలిపోయిందని హొస్సేని వివరించారు.
ఈ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ షిరాజీ కూడా మరణించారు. ఆయన శరీరం ఆనవాలు లేకుండా ఛిన్నాభిన్నమైందని, చివరకు కొన్ని కిలోల మాంసం ముద్దల ఆధారంగానే అది ఆయన మృతదేహమని గుర్తించామని హొస్సేని ఆవేదన వ్యక్తం చేశారు.
మోజ్తబా ఆరోగ్యంపై సందిగ్ధత!
మోజ్తబా ఖమేనీకి కేవలం కాలికి చిన్న గాయమైందని అధికారిక వర్గాలు చెబుతున్నప్పటికీ, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఆయన కాలు కోల్పోయారని, అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వార్తలు వస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన
ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. "మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై మాకు స్పష్టత లేదు. ఆయన ముఖం వికృతమైందని, కాలు పోయిందని చాలామంది అంటున్నారు. మరికొందరు ఆయన మరణించారని కూడా చెబుతున్నారు. మేము ఆయనను అసలు చూడలేదు, ఆయన బతికున్నారో లేదో కూడా మాకు తెలియదు," అని వ్యాఖ్యానించారు.
రష్యా ఆసుపత్రిలో మోజ్తబా చికిత్స?
మరోవైపు మోజ్తబాను రష్యా తీసుకెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. మాస్కోలోని ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. మోజ్తబాను రష్యాకు తీసుకురావాలని ఇరాన్ టాప్ అధికారులతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా చెప్పినట్టు సమాచారం.
మరి ఈ వార్త నిజమేనా? అన్న విషయంపై రష్యా స్పందించలేదు.