బంపర్ ఆఫర్- హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లపై రూ. 10 లక్షల వరకు డిస్కౌంట్!
కొత్త కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటించింది! ఐయోనిక్ 5, క్రెటా ఈవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఈవీలు, వీటి రేంజ్, లభిస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే ముందు కారు కొనుగోలుదారులకు హ్యుందాయ్ ఇండియా భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిపై డిసెంబర్ నెలకు గానూ అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది! ఎంపిక చేసిన మోడళ్లపై ఏకంగా రూ. 10 లక్షల వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. అయితే, ఈ ఆఫర్లు కేవలం 2024లో తయారైన, స్టాక్ ఉన్న వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియా మార్కెట్లో ‘ఐయోనిక్ 5’, 'క్రెటా ఈవీ' అనే రెండు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వాటిపై ఈ నెలలో లభిస్తున్న డిస్కౌంట్లను ఇక్కడ చూడండి..
ఐయోనిక్ 5 పై రూ. 10 లక్షల తగ్గింపు!
హ్యుందాయ్ ప్రీమియం ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ 'ఐయోనిక్ 5' పై ఏకంగా రూ. 10 లక్షల వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని ప్రత్యేకతలు చూస్తే:
రేంజ్ అండ్ పవర్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిలోని 72.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 214 హెచ్‌పీ పవర్, 350 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఛార్జింగ్: 350 కేడబ్ల్యూ డిసీ ఫాస్ట్ ఛార్జర్ వాడితే కేవలం 18 నిమిషాల్లోనే 20 నుండి 80 శాతం వరకు ఛార్జింగ్ ఎక్కుతుంది.
ధర: దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 49 లక్షలుగా ఉంది. భారత్‌లోనే అసెంబుల్ అవుతున్న ఈ కారు, తాజా డిస్కౌంట్‌తో అత్యంత ఆకర్షణీయమైన ధరకు లభించనుంది!
క్రెటా ఈవీపై కూడా ఆఫర్లు..
ఇక ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన 'క్రెటా ఈవీ'పై రూ. 35,000 వరకు ప్రయోజనాలను హ్యుందాయ్ అందిస్తోంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది:
42 కేడబ్ల్యూహెచ్ వేరియంట్: ఇది 390 కిమీ రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 18 లక్షల నుంచి రూ. 22.32 లక్షల మధ్య ఉంటుంది.
51.4 కేడబ్ల్యూహెచ్ వేరియంట్: ఇది 473 కిమీ రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 19.99 లక్షల నుంచి రూ. 24.69 లక్షల వరకు ఉంది.
ఫీచర్స్: ఈ కారును 50 కేడబ్లూ డీసీ ఛార్జర్‌తో కేవలం 58 నిమిషాల్లో 10 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
మీరు గనుక అదిరిపోయే రేంజ్, లగ్జరీ ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తుంటే, హ్యుందాయ్ అందిస్తున్న ఈ ఇయర్ ఎండ్ ఆఫర్లు ఒక సువర్ణావకాశం! స్టాక్ ముగిసేలోపు మీ సమీప డీలర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
హ్యుందాయ్ ఐసీఈ కార్లపైనా డిస్కౌంట్లు..
మరోవైపు ఐసీఈ వర్షెన్ కార్లపైనా హ్యుందాయ్ సంస్థ డిస్కౌంట్లను ఇస్తోంది. ఇవి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి.
1. గ్రాండ్ ఐ10 నియోస్..
డీలర్ ప్రయోజనాలు: రూ. 70,000 వరకు.
జీఎస్‌టీ తగ్గింపు: ధరలలో రూ. 70,000 వరకు తగ్గింపు.
మొత్తం ప్రయోజనాలు: వేరియంట్‌ను బట్టి కొనుగోలుదారులు రూ. 1.43 లక్షల వరకు మొత్తం తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 5.47 లక్షల నుంచి రూ. 7.66 లక్షల వరకు.
2. హ్యుందాయ్ ఐ20
డీలర్ ప్రయోజనాలు: రూ. 70,000 వరకు.
జీఎస్‌టీ తగ్గింపు: ధరలలో రూ. 98,058 వరకు తగ్గింపు.
మొత్తం ప్రయోజనాలు: ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై మొత్తం ప్రయోజనం రూ. 1.68 లక్షల వరకు ఉంది.
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 6.86 లక్షల నుంచి రూ. 10.51 లక్షల వరకు.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

E-Paper












