టెక్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపుతూ అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (ఐబీఎం) సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థలోని అతిపెద్ద విభాగమైన 'ఐబీఎం కన్సల్టింగ్'లో కీలకమైన ఉద్యోగాలకు ఇచ్చే వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వీసా నిబంధనలపై కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

"ఐబీఎం కన్సల్టింగ్‌లోని మెజారిటీ రోల్స్‌కు వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ను ఉపసంహరించుకోవాలని మేం నిర్ణయించుకున్నాం" అని కంపెనీ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
బాధితులకు మిగిలిన దారులు
ఈ నిర్ణయంతో ప్రభావితమైన ఉద్యోగులకు కంపెనీ రెండు ప్రత్యామ్నాయాలను చూపించింది. వారు అమెరికా వెలుపల ఉన్న ఐబీఎం కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడం లేదా ఈ ఏడాది ముగిసే సమయానికి సంస్థ నుంచి వైదొలగడం మాత్రమే చేయాలని పేర్కొంది. ఈ మేరకు కన్సల్టింగ్ విభాగం మేనేజర్లకు ఒక అంతర్గత లేఖ ద్వారా ఐబీఎం సమాచారం అందించింది. ప్రస్తుతం ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 1,50,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.
నైపుణ్యాల కొరతను అధిగమించడానికి గతంలో ఈ విభాగం ద్వారా అమెరికా 'హై-స్కిల్డ్ వీసా ప్రోగ్రామ్‌లలో' పాల్గొనేవామని ఐబీఎం తెలిపింది. అయితే కొన్నేళ్లుగా ఇందులో భాగస్వామ్యం తగ్గుతూ వస్తోందని, క్లయింట్ల అవసరాలు, నైపుణ్యాల లభ్యతలో మార్పులు వచ్చాయని పేర్కొంది. రెడ్ హాట్, హాషీకార్ప్, కాన్‌ఫ్లుయెంట్ వంటి సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా ఐబీఎం తమను తాము వేగంగా విస్తరించే సాఫ్ట్‌వేర్ ఆధారిత సంస్థగా తీర్చిదిద్దుకుంటోంది. అయితే 2024 నుంచి కన్సల్టింగ్ విభాగంలో వృద్ధి దాదాపు స్తంభించిపోవడం గమనార్హం.
ట్రంప్ వీసా ఆంక్షల వేడి
అమెరికా టెక్ పరిశ్రమలో విదేశీ ఉద్యోగులపై ఆధారపడటం చాలా కాలంగా వివాదాస్పద అంశంగా మారింది. గతేడాది ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్వదేశీయులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఐటీ దిగ్గజాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
{{/usCountry}}అమెరికా టెక్ పరిశ్రమలో విదేశీ ఉద్యోగులపై ఆధారపడటం చాలా కాలంగా వివాదాస్పద అంశంగా మారింది. గతేడాది ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్వదేశీయులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఐటీ దిగ్గజాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
{{/usCountry}}హెచ్-1బీ వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ యంత్రాంగం నిబంధనలను కఠినతరం చేసింది. అందులో భాగంగా హెచ్-1బీ అభ్యర్థులకు 1,00,000 డాలర్ల వరకు ఫైలింగ్ రుసుము ప్రతిపాదించడమే కాకుండా, లాటరీ విధానంలో అత్యధిక వేతనాలు ఆఫర్ చేసే కంపెనీలకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా మార్పులు తెచ్చింది. గత నెలలోనే వీసా ప్రోగ్రామ్‌లను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలతో మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి దిగ్గజ సంస్థలను హెచ్-1బీ వీసాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. యుఎస్‌సిఐఎస్ (USCIS) డేటా ప్రకారం మైక్రోసాఫ్ట్ 2026 బడ్జెట్ సంవత్సరంలో 3,828 హెచ్-1బీ వీసా ఆమోదాలను పొందింది.
పడిపోయిన ఐబీఎం వీసా సంఖ్య
సెప్టెంబర్ 30తో ముగిసిన 2026 బడ్జెట్ సంవత్సరంలో ఐబీఎం సంస్థ కేవలం 1,611 హెచ్-1బీ వీసా ఆమోదాలను మాత్రమే సాధించింది. 2025లో ఈ సంఖ్య 2,045గా ఉండగా, ఈసారి స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. యుఎస్‌సిఐఎస్ గణాంకాల ప్రకారం 2009 నుంచి ఐబీఎం మొత్తం 27,863 సార్లు హెచ్-1బీ ఉద్యోగులకు స్పాన్సర్‌షిప్ ఇచ్చి, వీసా స్పాన్సర్లలో 20వ స్థానంలో నిలిచింది.