IBPS clerk results : ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ 2026 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్, అలాట్‌మెంట్ స్టేటస్‌ను అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా ఏప్రిల్ 1 వరకు చూసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Mar 2, 2026, 12:49:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంకింగ్ రంగంలో క్లర్క్ పోస్టుల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్షా ఫలితాలను బోర్డు నేడు (మార్చి 2, 2026) విడుదల చేసింది. ఈ ఫలితాలతో పాటు అభ్యర్థులకు ఏ బ్యాంకులో ఉద్యోగం లభించిందనే 'ప్రొవిజనల్ అలాట్‌మెంట్' ప్రక్రియను కూడా ఐబీపీఎస్ పూర్తి చేసింది.

ఐబీపీఎస్​ క్లర్క్​ మెయిన్స్​ ఫలితాలు 2026
ఐబీపీఎస్​ క్లర్క్​ మెయిన్స్​ ఫలితాలు 2026

ఐబీపీఎస్​ క్లర్క్​ మెయిన్స్​ ఫలితాలు 2026- ముఖ్యమైన తేదీలు & అలాట్‌మెంట్ వివరాలు..

ఫలితాల లభ్యత: మార్చి 2 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

అలాట్‌మెంట్: చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం మినహా, మిగిలిన అన్ని రాష్ట్రాలు/ప్రాంతాలకు సంబంధించిన ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన వారికి డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, వైద్య పరీక్షలు వంటివి ఉంటాయి. ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరవచ్చు.

నోటీసు సారాంశం: డిసెంబర్ 31, 2025న ఇచ్చిన నోటీసు ప్రకారం, 2025-26 ఖాళీలకు సంబంధించిన పూర్తి అలాట్‌మెంట్ ప్రక్రియ ఈ నోటీసుతో ముగిసిందని ఐబీపీఎస్ స్పష్టం చేసింది. అలాట్‌మెంట్ స్టేటస్ లేదా ప్రాసెస్ గురించి అభ్యర్థుల నుంచి ఎలాంటి విన్నపాలు స్వీకరించరు.

ఐబీపీఎస్​ క్లర్క్​ మెయిన్స్​ ఫలితాలు 2026- స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్టెప్​ 1- ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్‌పేజీలో కనిపించే "IBPS Clerk Mains Result 2026" లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.

స్టెప్​ 4- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్​ 5- మీ మార్కులు, అలాట్‌మెంట్ వివరాలను సరిచూసుకుని, పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్​ 6- భవిష్యత్తు అవసరాల కోసం ఒక హార్డ్ కాపీ (ప్రింటవుట్) దగ్గర ఉంచుకోండి.

ఐబీపీఎస్​ క్లర్క్​ మెయిన్స్​ ఫలితాలను చెక్​ చేసుకునేందుకు కావాల్సిన లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐబీపీఎస్​ క్లర్క్​ మెయిన్స్​ ఫలితాలు 2026- కటాఫ్​ వివరాలు..

తెలంగాణలో-

  • ఎస్సీ- 36.25
  • ఎస్టీ- 38.13
  • ఓబీసీ- 42.38
  • ఈడబ్ల్యూఎస్​- 39.25
  • యూఆర్​- 42.63

ఆంధ్రప్రదేశ్​లో-

  • ఎస్సీ- 39.38
  • ఎస్టీ- 33.25
  • ఓబీసీ- 45.00
  • ఈడబ్ల్యూఎస్​- 45.00
  • యూఆర్​- 45.25

ఐబీపీఎస్​ క్లర్క్​ మెయిన్స్​ ఫలితాలు 2026- పరీక్షా సరళి, నెగటివ్ మార్కింగ్..

నవంబర్ 29, 2025న జరిగిన ఈ మెయిన్స్ పరీక్షలో మొత్తం 155 ప్రశ్నలు ఉండగా, గరిష్ట మార్కులు 200. పరీక్ష సమయం 120 నిమిషాలు.

విభాగాలు: 1. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, 2. జనరల్ ఇంగ్లీష్, 3. రీజనింగ్ ఎబిలిటీ, 4. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.

నెగటివ్ మార్కింగ్: తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో నాల్గొవ వంతు (0.25) మార్కులను పెనాల్టీగా తగ్గిస్తారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More