చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు చదువుతున్న అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీఏ ఇంటర్మీడియట్ సెప్టెంబర్ 2026 ఫలితాలు వచ్చేశాయి. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) గురువారం (అక్టోబర్ 22న) అధికారిక పోర్టల్‌లో ఈ ఫలితాలను విడుదల చేసింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరిగిన సీఏ ఇంటర్మీడియట్ పరీక్షల స్కోర్‌కార్డులు, మెరిట్ జాబితా, ఉత్తీర్ణత శాతాన్ని ఐసీఏఐ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి ఫలితాలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సీఏ ఇంటర్ సెప్టెంబర్ 2026 ఫలితాలు- ఆల్ ఇండియా టాపర్లు వీరే!
ఈసారి వెలువడిన సీఏ ఇంటర్మీడియట్ ఫలితాల్లో నీల్ రాజేష్ షా, చందక్ సాక్షి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ (ఏఐఆర్ 1) సాధించారు. వీరు సాధించిన విజయంపై పలువురు ఐసీఏఐ ప్రతినిధులు, విద్యావేత్తలు ప్రశంసలు కురిపించారు.
సీఏ ఇంటర్ సెప్టెంబర్ 2026 ఫలితాలు- పాస్ పర్సెంటేజ్..
ఫలితాల విడుదలతో పాటు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతాన్ని ఐసీఏఐ అధికారికంగా వెల్లడించింది:
గ్రూప్-I: 23.14 శాతం
గ్రూప్-II: 18.92 శాతం
రెండు గ్రూపులు : 13.21 శాతం
అత్యంత కఠినమైన మూల్యాంకనం ఉండే సీఏ కోర్సులో బోత్ గ్రూప్స్‌లో 13 శాతానికి పైగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించడం విశేషం.
సీఏ ఇంటర్ సెప్టెంబర్ 2026 ఫలితాలు చెక్ చేసుకునేందుకు కావాల్సిన డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీఏ ఇంటర్ సెప్టెంబర్ 2026 ఫలితాలు- స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..
- అభ్యర్థులు caresults.icai.org, icai.nic.in లేదా icaiexam.icai.org వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు.
- ముందుగా ఐసీఏఐ అధికారిక ఫలితాల పోర్టల్ caresults.icai.org ని సందర్శించాలి.
- హోమ్‌పేజీలో ఉన్న 'CA Intermediate September 2026 Examination Result' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ నమోదు చేయాలి.
- స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ‘సబ్మీట్’పై క్లిక్ చేయాలి.
- మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ లేదా పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవాలి.
ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ ద్వారా సీఏ ఇంటర్ సెప్టెంబర్ 2026 ఫలితాలు..
వెబ్సైట్ ట్రాఫిక్ వల్ల ఆలస్యం కాకుండా నేరుగా ఫోన్‌కు ఫలితాలు పొందే సదుపాయాన్ని కూడా ఐసీఏఐ కల్పించింది. ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు పొందాలనుకునే అభ్యర్థులు CAIPCNEW అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి తమ 6 అంకెల సీఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి 58888 నంబర్‌కు సందేశం పంపాల్సి ఉంటుంది.
మార్కుల వెరిఫికేషన్ ప్రక్రియ..
{{/usCountry}}వెబ్సైట్ ట్రాఫిక్ వల్ల ఆలస్యం కాకుండా నేరుగా ఫోన్‌కు ఫలితాలు పొందే సదుపాయాన్ని కూడా ఐసీఏఐ కల్పించింది. ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు పొందాలనుకునే అభ్యర్థులు CAIPCNEW అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి తమ 6 అంకెల సీఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి 58888 నంబర్‌కు సందేశం పంపాల్సి ఉంటుంది.
మార్కుల వెరిఫికేషన్ ప్రక్రియ..
{{/usCountry}}సీఏ ఇంటర్ సెప్టెంబర్ 2026 ఫలితాల్లో తమకు వచ్చిన మార్కులతో అసంతృప్తిగా ఉన్న లేదా జవాబు పత్రాల మూల్యాంకనంపై సందేహాలు ఉన్న అభ్యర్థులు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పేపర్‌కు రూ.100 రుసుము చెల్లించి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవడానికి ఐసీఏఐ అవకాశం కల్పిస్తోంది.
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు పంపాలనుకునే వారు 'ది డిప్యూటీ సెక్రటరీ (ఎగ్జామ్స్), ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసీఏఐ భవన్, ఇంద్రప్రస్థ మార్గ్, దిల్లీ - 110002' చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. వెరిఫికేషన్ సమయంలో మార్కుల కూడికలో తప్పులు, మూల్యాంకనం కాకుండా మిగిలిపోయిన సమాధానాలు, జవాబు పత్రాల క్రమం వంటి అంశాలను అధికారులు సమగ్రంగా తనిఖీ చేస్తారు.