టీమిండియాకు స్లో ఓవర్ రేట్ ఫైన్ తప్పించాలని ఫోన్ కాల్- బీసీసీఐ పవర్ రాజకీయాలు: ఐసీసీ మాజీ రిఫరీ సంచలన ఆరోపణలు
ఐసీసీ మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ సంచలన ఆరోపణలు చేశాడు. క్రికెట్లో అధికారాన్ని బీసీసీఐ గుప్పిట్లో పెట్టుకుని, రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఓ మ్యాచ్ లో టీమిండియా స్లో ఓవర్ రేట్ తప్పించాలని ఫోన్ కాల్ వచ్చిందని ఆరోపించాడు.
ఐసీసీ మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్.. బీసీసీఐ, టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అతను తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఓ మ్యాచ్ లో టీమిండియాకు స్లో ఓవర్ రేట్ కారణంగా విధించాల్సిన ఫైన్ ను తప్పించాలని తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని వెల్లడించాడు. ఆ సమయంలో నిబంధనల అమలులో క్రికెట్ రాజకీయాల పాత్రను ఇది ఎత్తి చూపిందని బ్రాడ్ అన్నాడు.

స్లో ఓవర్ రేట్
ది టెలిగ్రాఫ్ తో మాట్లాడుతూ టీమిండియా స్లో ఓవర్ రేట్ ను సర్దుబాటు చేయాల్సి వచ్చిందని క్రిస్ బ్రాడ్ చెప్పాడు. ఆ మ్యాచ్ ఏది అన్నది తెలపలేదు. కానీ ఆ మ్యాచ్ లో మెన్ ఇన్ బ్లూ నిర్దిష్ఠ సమయం లోపు మూడు లేదా నాలుగు ఓవర్లు వెనుకబడి ఉందని బ్రాడ్ అన్నాడు. అప్పుడు రూల్స్ ప్రకారం ఫైన్ వేయాల్సిందని చెప్పాడు.
ఫోన్ కాల్
తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని క్రిస్ బ్రాడ్ తెలిపాడు. ‘‘మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియాకు ఫైన్ విధించాల్సిన పరిస్థితి. అప్పుడు నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. చూసి చూడనట్లు వదిలేయండి, ఎందుకంటే ఇది ఇండియా అని చెప్పారు. దీంతో కొంత టైమ్ సర్దుబాటు చేసి నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి అయ్యాయని మార్చాల్సి వచ్చింది’’ అని క్రిస్ బ్రాడ్ ఆరోపించాడు.
మళ్లీ అదే తప్పు
టీమిండియా తర్వాతి మ్యాచ్ లోనూ స్లో ఓవర్ రేట్ తప్పును రిపీట్ చేసిందని క్రిస్ బ్రాడ్ చెప్పాడు. బీసీసీఐ నుంచి వార్నింగ్ ఉన్నప్పటికీ అప్పటి కెప్టెన్ సౌరభ్ గంగూలీ పట్టించుకోలేదని బ్రాడ్ తెలిపాడు.
"తరువాతి మ్యాచ్ లోనూ సరిగ్గా అదే జరిగింది. అతను [సౌరభ్ గంగూలీ] ఏ హడావిడిని వినలేదు. కాబట్టి నేను ఫోన్ చేసి 'నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు?’ అని అడిగా. అప్పుడు అతను ‘మీకు కాల్ చేసిన వ్యక్తికి చేయండి’ అని అన్నాడు. మొదటి నుండి క్రికెట్లో రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కుర్రాళ్లు రాజకీయంగా మరింత తెలివితేటలు కలిగి ఉన్నారు’’ అని బ్రాడ్ పేర్కొన్నాడు.
ఐసీసీని స్వాధీనం
‘‘బీసీసీఐకి డబ్బులున్నాయి. ఇప్పుడు ఐసీసీని అనేక విధాలుగా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు నేను ఆ బాధ్యతల్లో లేనందుకు సంతోషిస్తున్నా. గతంలో చాలా రాజకీయాలు చూశా’’ అని బ్రాడ్ ఆరోపించాడు. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా జై షా ఉన్న సంగతి తెలిసిందే. ఐసీసీ రిఫరీగా తన కెరీర్ లో 123 టెస్టులను పర్యవేక్షించిన బ్రాడ్.. చివరగా 2024లో బాధ్యతలు నిర్వర్తించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


