కంపెనీ సెక్రటరీ (CS) కోర్సు చదువుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI), డిసెంబర్ 2025లో నిర్వహించిన ప్రొఫెషనల్ మరియు ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (సిలబస్ 2022) పరీక్షల ఫలితాలను బుధవారం (ఫిబ్రవరి 25, 2026) విడుదల చేసింది.

షెడ్యూల్ ప్రకారం, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. కాగా, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఫలితాలను మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఐసీఎస్ఐ అధికారిక వెబ్‌సైట్ icsi.edu ద్వారా తమ రిజల్ట్స్, సబ్జెక్టుల వారీగా మార్కులను తనిఖీ చేసుకోవచ్చు.
ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?
మీ ఫలితాలను సులభంగా చూసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి:
- మొదట ICSI అధికారిక వెబ్‌సైట్ icsi.edu సందర్శించండి.
- హోమ్ పేజీలో కనిపించే 'ICSI CS Result 2026' లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ లాగిన్ వివరాలు (రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్) ఎంటర్ చేయండి.
- 'Submit' బటన్‌పై క్లిక్ చేయగానే మీ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- మీ మార్కుల స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోంది.
మార్కుల జాబితా (Marks Statement) ముఖ్యాంశాలు:
ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అభ్యర్థులకు ఫలితాలు వెల్లడైన వెంటనే, వారి రిజిస్టర్డ్ చిరునామాలకు మార్కుల స్టేట్‌మెంట్ భౌతిక కాపీని (Physical Copy) పంపడం జరుగుతుంది. ఒకవేళ ఫలితాలు వచ్చిన 30 రోజుల్లోపు ఈ కాపీ అందకపోతే, అభ్యర్థులు తమ వివరాలతో exam@icsi.edu కు మెయిల్ చేసి సంస్థను సంప్రదించవచ్చు.
అయితే, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అభ్యర్థులకు మాత్రం ఆన్‌లైన్ ఇ-మార్క్స్ స్టేట్‌మెంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీరికి విడిగా భౌతిక కాపీలు పంపరు.
తదుపరి పరీక్షల షెడ్యూల్
{{/usCountry}}అయితే, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అభ్యర్థులకు మాత్రం ఆన్‌లైన్ ఇ-మార్క్స్ స్టేట్‌మెంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీరికి విడిగా భౌతిక కాపీలు పంపరు.
తదుపరి పరీక్షల షెడ్యూల్
{{/usCountry}}ఈ ఫలితాలతో పాటు తదుపరి జూన్ 2026 సెషన్ పరీక్షల వివరాలను కూడా ఐసీఎస్ఐ వెల్లడించింది. జూన్ సెషన్ పరీక్షలు జూన్ 1 నుంచి జూన్ 7, 2026 వరకు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ ఫిబ్రవరి 26 నుంచే ప్రారంభం కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్రశ్న: ICSI CS 2026 ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి?
జవాబు: అభ్యర్థులు తమ ఫలితాలను ఐసీఎస్ఐ అధికారిక పోర్టల్ icsi.edu లో చూసుకోవచ్చు.
ప్రశ్న: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ మార్కుల జాబితా ఇంటికి వస్తుందా?
జవాబు: లేదు, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అభ్యర్థులు ఆన్‌లైన్ నుంచే తమ ఇ-మార్క్స్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కేవలం ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అభ్యర్థులకు మాత్రమే పోస్ట్ ద్వారా మార్కుల జాబితా పంపుతారు.
ప్రశ్న: మార్కుల షీట్ రాకపోతే ఎవరిని సంప్రదించాలి?
జవాబు: ఫలితాలు వచ్చిన 30 రోజుల్లోపు ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అభ్యర్థులకు మార్కుల షీట్ అందకపోతే, exam@icsi.edu కు ఫిర్యాదు చేయవచ్చు.