Family car : బెస్ట్ 7 సీటర్ ఫ్యామిలీ కారు ఇది.. మారుతీ సుజుకీ ఎర్టిగాలో ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్?
Maruti Suzuki Ertiga : మీరు మీ కుటంబానికి సరిపోయేలా ఒక మంచి ఎంపీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ సెగ్మెంట్లో ది బెస్ట్ ఆప్షన్ మారుతీ సుజుకీ ఎర్టిగా అని తెలిసిందా? మరి ఈ 7 సీటర్ మోడల్లోని ఏ వేరియంట్‌ని ఎంచుకోవాలి? ఏది వాల్యూ ఫర్ మనీ? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
మన ఇంట్లో సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణ హ్యాచ్‌బ్యాక్, సెడాన్ లేదా చిన్నపాటి ఐదు సీట్ల ఎస్‌యూవీలు సరిపోవు. అందరూ కలిసి ప్రయాణించాలంటే కచ్చితంగా ఒక మంచి 7-సీటర్ ఎంపీవీ ఉండాల్సిందే. ఈ విభాగంలో దశాబ్ద కాలంగా తిరుగులేని రారాజుగా వెలుగుతోంది ‘మారుతీ సుజుకీ ఎర్టిగా’. సౌకర్యవంతమైన ప్రయాణం, ఈజీ డ్రైవింగ్, నమ్మకమైన మైలేజీ దీని సొంతం. అయితే, ఎర్టిగా లైనప్‌లో అన్నింటికంటే 'జెడ్ఎక్స్ఐ' వేరియంట్ కొనుగోలు చేయడం అత్యంత తెలివైన నిర్ణయం అని చెప్పవచ్చు. టాప్-ఎండ్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ+ కంటే ఇది ఏ విధంగా బెస్ట్ చాయిస్ అవుతుందో పూర్తి వివరాల్లో చూద్దాం.

మారుతీ సుజుకీ కార్లలో ఎల్లప్పుడూ బడ్జెట్ ఫ్రెండ్లీ, వాల్యూ-ఫర్-మనీ ఆప్షన్లకు డిమాండ్ ఎక్కువ. ఎర్టిగా మోడల్‌లో 'జెడ్ఎక్స్ఐ' వేరియంట్ సరిగ్గా ఇలాంటి ఫీచర్లనే అందిస్తుంది. ఇది వినియోగదారుడి జేబుకు చిల్లు పడకుండా, రోజువారీ జీవితంలో అవసరమయ్యే దాదాపు అన్ని ఆధునిక లగ్జరీ ఫీచర్లను అందిస్తూ బడ్జెట్, ఫీచర్ల మధ్య సరైన సమతుల్యతను పాటిస్తుంది. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో లభించే అత్యుత్తమ 7-సీటర్ కార్లలో ఇది మొదటి స్థానంలో నిలుస్తుంది.
ధర విషయానికి వస్తే, ఎర్టిగా జెడ్ఎక్స్ఐ మ్యాన్యువల్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.96 లక్షలుగా ఉంది. అదేవిధంగా, మైలేజీ ప్రియుల కోసం అందుబాటులో ఉన్న సీఎన్జీ వేరియంట్ ధర రూ. 11.92 లక్షలు కాగా, ట్రాఫిక్ కష్టాలు లేకుండా హాయిగా డ్రైవ్ చేయాలనుకునే వారి కోసం తీసుకొచ్చిన ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 12.31 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ధర పరిధిలో ఇంతకంటే మెరుగైన స్పేస్, నమ్మకం ఇచ్చే మరో ఫ్యామిలీ కారు మార్కెట్లో లేదనే చెప్పాలి.
మారుతీ సుజుకీ ఎర్టిగా- పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు..
మారుతీ సుజుకీ ఎర్టిగా జెడ్ఎక్స్ఐ వేరియంట్ పవర్‌ఫుల్ అండ్ ఎఫీషియంట్ కే15సీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్-సిలిండర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 101.6 బీహెచ్పీ పవర్‌ని, 139 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను జత చేశారు. ఇక ఖర్చులను మరింత తగ్గించుకోవాలనుకునే వారి కోసం 86.6 బీహెచ్పీ పవర్‌ని, 121.5 ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేసే సీఎన్జీ మోడల్ కూడా ఉంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.
మారుతీ సుజుకీ ఎర్టిగా- ఇంటీరియర్ ఫీచర్లు సూపర్..
ఈ 7 సీటర్ ఫ్యామిలీ కారు లోపలి భాగం లగ్జరీగా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్, ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ అప్‌హోలిస్ట్రీ కారుకు కొత్త అందాన్ని తెచ్చాయి. ఇక కుటుంబ ప్రయాణాల్లో లగేజీ సర్దుబాటు కోసం సెకండ్ రోలో 60:40 స్ప్లిట్, థర్డ్ రోలో 50:50 స్ప్లిట్ సీటింగ్ సదుపాయం కల్పించారు.
కారు డ్రైవర్ కోసం కలర్ డిస్‌ప్లేతో కూడిన మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, బయటి ఉష్ణోగ్రతను చూపే గేజ్, కారులో ఉన్న ఇంధనానికి ఎంత దూరం ప్రయాణించవచ్చో తెలిపే 'డిస్టెన్స్ టు ఎంప్టీ' వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
మారుతీ సుజుకీ ఎర్టిగా- సౌకర్యం, టెక్నాలజీకి పెద్ద పీట..
ఎండకాలంలో కూడా ఎంపీవీలోని ఏడుగురికీ సమానంగా చల్లదనం వచ్చేలా మూడు వరుసల్లోనూ ఏసీ వెంట్లను అమర్చారు. ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, అన్ని పవర్ విండోస్, ఆటోమేటిక్ వేరియంట్‌లో రేస్ కార్ల లాంటి ఫీలింగ్ ఇచ్చే ప్యాడల్ షిఫ్టర్లు ఇందులో ఉన్నాయి.
యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 7-ఇంచుల డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణాల్లో మంచి సంగీతాన్ని ఆస్వాదించడానికి ఫోర్-స్పీకర్ సౌండ్ సిస్టమ్, చేతులు తిప్పకుండానే ఆడియోను కంట్రోల్ చేసేలా మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి లగ్జరీ హంగులన్నీ ఈ వేరియంట్‌లో లభిస్తాయి. అందుకే అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టి టాప్ వేరియంట్ కొనడం కంటే, జెడ్ఎక్స్ఐ వేరియంట్ ఎంచుకోవడం అన్ని విధాలా లాభదాయకం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


