భారత మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం 'రెనాల్ట్' తన అత్యంత ప్రాచుర్యం పొందిన డస్టర్ మోడల్లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. దేశీయ ఆటో ప్రియులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ 'డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్' ప్రారంభ ధరను కంపెనీ రూ.16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.
గతంలో భారత రోడ్లను ఏలిన డస్టర్ బ్రాండ్.. ఇప్పుడు అత్యంత ఆధునిక హైబ్రిడ్ పరిజ్ఞానంతో పునరాగమనం చేయడం మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలకు కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి మోడళ్లకు డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ నేరుగా సవాలు విసురుతోంది.
ఈ నేపథ్యంలో ఈ రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పవర్ఫుల్ ఇంజిన్.. లీటరుకు 29 కి.మీ మైలేజ్!
సాంకేతిక వివరాల్లోకి వెళ్తే, ఈ ఎస్‌యూవీలో 1.8-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి తోడుగా 1.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అనుసంధానమై పనిచేస్తాయి. ఈ కాంబినేషన్ మొత్తం 160 పీఎస్ హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక ఏఆర్ఏఐ ధృవీకరించిన గణాంకాల ప్రకారం.. ఈ రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎస్యూవీ.. లీటరుకు ఏకంగా 29 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. నగర ప్రయాణాలతో పాటు సుదీర్ఘ హైవే ప్రయాణాల్లోనూ ఇది జేబుకు చిల్లు పడకుండా మంచి మైలేజ్ అందిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్- మూడు విభిన్న వేరియంట్లలో..
వినియోగదారుల బడ్జెట్, అవసరాలకు తగినట్లుగా రెనాల్ట్ ఈ కారును మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది:
- ఎవల్యూషన్ - బేస్ వేరియంట్
- టెక్నో - మిడ్ వేరియంట్
- ఎమోషన్ - టాప్-ఎండ్ వేరియంట్
వినియోగదారుల బడ్జెట్, అవసరాలకు తగినట్లుగా రెనాల్ట్ ఈ కారును మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది:
- ఎవల్యూషన్ - బేస్ వేరియంట్
- టెక్నో - మిడ్ వేరియంట్
- ఎమోషన్ - టాప్-ఎండ్ వేరియంట్
ఎంట్రీ లెవల్ 'ఎవల్యూషన్' మోడల్‌తో పోలిస్తే టాప్-ఎండ్ 'ఎమోషన్' వేరియంట్ ధర రూ.2.50 లక్షలు అదనంగా ఉంది. ప్రతీ వేరియంట్‌ను ఫీచర్లు, ధరల నిష్పత్తిని బ్యాలెన్స్ చేస్తూ తీర్చిదిద్దారు.
'ఎమోషన్' వేరియంట్: లగ్జరీ, సౌకర్యాల సమాహారం
ఈ మోడల్ లైన్-అప్‌లోనే అత్యంత ప్రీమియం వేరియంట్‌గా 'ఎమోషన్' నిలుస్తోంది. మిడ్-వేరియంట్ 'టెక్నో' కంటే కేవలం రూ.50,000 అదనపు వ్యయంతోనే అనేక విలాసవంతమైన ఫీచర్లను అందిస్తోంది.
ఈ వేరియంట్ క్యాబిన్లో 10.25-అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో నేరుగా నెవిగేషన్ మ్యాప్‌లను స్క్రీన్ పైనే చూసే వెసులుబాటు ఉంది. వీటితో పాటు డ్యూన్ బ్రౌన్ లేథరెట్ అప్‌హోలిస్ట్రీ, డ్రైవర్ సీటుకు 6-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్, ముందు సీట్లకు వెెంటిలేటెడ్ సౌకర్యం కల్పించారు. వెనుక లగేజ్ బూట్ ఓపెన్ చేయడానికి హ్యాండ్స్-ఫ్రీ పవర్డ్ టైల్గేట్, మెరుగైన సంగీత అనుభూతి కోసం 6-స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను సైతం జోడించారు.
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్..
ధర, ప్రాథమిక ఫీచర్ల మధ్య సరైన బ్యాలెన్స్ కోరుకునే వారికి 'టెక్నో' వేరియంట్ సరైన ఎంపికగా నిలుస్తుంది. అయితే, కేవలం రూ.50,000 అదనంగా వెచ్చించడం ద్వారా వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ మ్యాప్ డిస్ప్లే వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు లభిస్తుండటంతో ప్రయాణంలో అత్యున్నత సౌకర్యాన్ని ఆశించేవారు రెనాల్డ్ డస్టర్ హైబ్రిడ్ 'ఎమోషన్' వేరియంట్‌ను వాల్యూ ఫర్ మనీ మోడల్‌గా భావించవచ్చని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.