నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇగ్నో మెగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2026 వివరాలు…
ఇగ్నో (IGNOU) తన విద్యార్థులు, పూర్వ విద్యార్థుల కోసం ఫిబ్రవరి 25, 2026న దిల్లీలోని తన ప్రధాన క్యాంపస్‌లో భారీ 'మెగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్'ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది జరగనున్న రెండో అతిపెద్ద ప్లేస్‌మెంట్ ఈవెంట్ ఇది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) తన విద్యార్థులు, పూర్వ విద్యార్థుల (అలుమ్నీ) కోసం ఒక భారీ అవకాశాన్ని ప్రకటించింది. 2026 సంవత్సరానికి సంబంధించి రెండో మెగా ఆన్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ఫిబ్రవరి 25న నిర్వహించనున్నట్టు వెల్లడించింది. యూనివర్సిటీలోని క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్ (సీపీసీ) ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరగనుంది.

ఇగ్నో మెగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2026- ఎప్పుడు? ఎక్కడ?
ఈ ఇగ్నో మెగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్.. ఫిబ్రవరి 25, 2026న దిల్లీలోని మైదాన్ గర్హిలో ఉన్న ఇగ్నో క్యాంపస్‌లోని బీఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటల కల్లా రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.
జనవరిలో నిర్వహించిన డ్రైవ్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన దృష్ట్యా, విద్యార్థుల కెరీర్ మార్గాలను సుగమం చేసేందుకు ఈ రెండో విడతను ఇగ్నో తలపెట్టింది.
ఇగ్నో మెగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2026- వివిధ రంగాలలో వేలాది అవకాశాలు..
ఈ ఇగ్నో మెగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2026 డ్రైవ్‌లో వివిధ పరిశ్రమలకు చెందిన దిగ్గజ సంస్థలు పాల్గొని, అభ్యర్థులకు ప్రస్తుత ఇండస్ట్రీ ప్రమాణాల ప్రకారం వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రధానంగా ఈ కింది రంగాల్లో నియామకాలు జరగనున్నాయి:
ఫిన్‌టెక్, ఐటీ, బ్యాంకింగ్ అండ్ బీపీఓ: ఈ విభాగాల్లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్, సేల్స్, టెలి-ఎగ్జిక్యూటివ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు, అలాగే బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, ఎంకామ్ పూర్తి చేసిన వారు అర్హులు.
హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్: ట్రావెల్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ సపోర్ట్ ప్రొఫెషనల్స్, బ్యాక్ ఆఫీస్ ఇంటర్న్ పోస్టుల కోసం నియామకాలు జరుగుతాయి. ట్రావెల్ అండ్ టూరిజంలో డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారు హాజరుకావచ్చు.
ఎడ్-టెక్: అకడమిక్ కౌన్సెలర్లు, టాలెంట్ అక్విజిషన్ మేనేజర్లు, సేల్స్ మేనేజర్ల కోసం సంస్థలు వెతుకుతున్నాయి. మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఉన్న గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం.
ఏవియేషన్ (విమానయానం): దిల్లీ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాల కోసం గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్, కస్టమర్ సర్వీస్ ఏజెంట్లు, ప్యాసింజర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
హెల్త్ కేర్: హోమ్-బేస్డ్ హెల్త్ కేర్ సర్టిఫికేట్ కోర్సు చేసిన వారికి హోమ్ కేర్ ప్రొఫెషనల్స్‌గా అవకాశాలు కల్పించనున్నారు.
ఇగ్నో మెగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2026- అర్హతలు, డాక్యుమెంట్లు..
ఈ డ్రైవ్ కేవలం ఇగ్నో విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు మాత్రమే ప్రత్యేకం. అభ్యర్థులు తమతో పాటు ఈ కింది పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి:
అప్‌డేట్ చేసిన రెజ్యూమ్
ప్రభుత్వం జారీ చేసిన అసలు గుర్తింపు కార్డు
విద్యా అర్హత, అనుభవ ధృవీకరణ పత్రాలు
ఎంపికైన అభ్యర్థులు ప్రధానంగా దిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నిరుద్యోగ యువతకు, మెరుగైన అవకాశాల కోసం చూస్తున్న పూర్వ విద్యార్థులకు ఇది ఒక గొప్ప వేదిక అని క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్ పేర్కొంది.
ఇగ్నో మెగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2026 పూర్తి పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


