...
...
Next Story

IIT Madras Internship 2026 : నెలకు రూ. 15వేల స్టైఫండ్​తో ఐఐటీ మద్రాస్​లో ఇంటర్న్​షిప్​- పూర్తి వివరాలు..

ఐఐటీ మద్రాస్ తన ప్రతిష్టాత్మక 'సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2026' కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల్లో ఇంటర్న్​షిప్​ పొందాలనుకునే ఐఐటీయేతర విద్యార్థులకు ఇది సువర్ణావకాశం. ఎంపికైన వారికి నెలకు రూ. 15,000 స్టైపెండ్ సైతం లభిస్తుంది. పూర్తి వివరాలు..

Published on: Feb 03, 2026 10:01 AM IST
Advertisement

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్, తన 'సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2026' కోసం రిజిస్ట్రేషన్​ ప్రక్రియను ఇటీవలే ప్రారంభించింది. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్సెస్ లేదా హ్యుమానిటీస్ విభాగాల్లో ఎక్స్​పీరియెన్స్​ పొందాలనుకునే విద్యార్థులు ఈ రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ కింద ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. 15,000 స్టైఫండ్ అందజేస్తారు. అయితే, ఈ ఫెలోషిప్ కేవలం ఐఐటీల్లో నమోదు కాని విద్యార్థులకు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి.

ఐఐటీ మద్రాస్​ సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2026 వివరాలు..
ఐఐటీ మద్రాస్​ సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ 2026 వివరాలు..

ఐఐటీ మద్రాస్​ ఇంటర్న్​షిప్​ ప్రోగ్రామ్ 2026 మే 18 నుంచి జులై 17 (అంచనా) వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు మార్చ్​ 2, 2026 సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఐఐటీ మద్రాస్ ఇంటర్న్‌షిప్ 2026: అర్హతలు, అవసరమైన పత్రాలు..

అర్హతలు: యూనివర్సిటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి, అద్భుతమైన అకాడమిక్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది. అభ్యర్థుల అకాడమిక్ పనితీరుతో పాటు సెమినార్లలో సమర్పించిన పేపర్లు, పూర్తి చేసిన ప్రాజెక్టులు, పాల్గొన్న డిజైన్ పోటీలు, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో సాధించిన స్కోరు/ర్యాంకు, ఇతర అవార్డులు లేదా విశిష్టతలను పరిగణనలోకి తీసుకుంటారు.

యూజీ: ప్రస్తుతం బీఈ / బీటెక్ / బీఎస్సీ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న వారు. అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 3 ఏళ్ల బీఎస్సీ చదువుతున్న వారు.

పీజీ: ఇంటిగ్రేటెడ్ / డ్యూయల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఎంఈ./ ఎంటెక్​ / ఎంఎస్​సీ) లో 3వ లేదా 4వ సంవత్సరం చదువుతున్న వారు.

అవసరమైన పత్రాలు: దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఈ క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:

పాస్‌పోర్ట్ సైజు ఫోటో

కేటగిరీ సర్టిఫికేట్ (వర్తిస్తే)

ఆధార్ కార్డ్

బోనఫైడ్ సర్టిఫికేట్: మీరు సదరు విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థి అని ధృవీకరిస్తూ సంస్థ హెడ్ జారీ చేసిన లేఖ.

అకాడమిక్ సర్టిఫికేట్స్: 10వ తరగతి, 12వ తరగతి / పాలిటెక్నిక్ మార్క్ షీట్లతో పాటు ప్రస్తుతం చదువుతున్న కోర్సులో ఇటీవల ముగిసిన సెమిస్టర్ వరకు ఉన్న అన్ని మార్క్ షీట్లను ఒకే పీడీఎఫ్​గా జతచేయాలి.

ఐఐటీ మద్రాస్​ ఇంటర్న్‌షిప్ 2026 ఆఫర్ చేస్తున్న విభాగాలు:

1. ఇంజనీరింగ్ విభాగాలు:

ఏరోస్పేస్ ఇంజనీరింగ్

అప్లైడ్ మెకానిక్స్ అండ్​ బయోమెడికల్ ఇంజనీరింగ్

బయోటెక్నాలజీ

కెమికల్ ఇంజనీరింగ్

సివిల్ ఇంజనీరింగ్

కంప్యూటర్ సైన్స్ అండ్​ ఇంజనీరింగ్

డేటా సైన్స్ అండ్​ ఏఐ

ఇంజనీరింగ్ డిజైన్

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్

మెడికల్ సైన్స్ అండ్​ టెక్నాలజీ

మెటలర్జికల్ అండ్​ మెటీరియల్స్ ఇంజనీరింగ్

ఓషన్ ఇంజనీరింగ్

2. సైన్స్ విభాగాలు:

ఫిజిక్స్

కెమిస్ట్రీ

మ్యాథమెటిక్స్

3. హ్యుమానిటీస్ అండ్​ సోషల్ సైన్సెస్

4. మేనేజ్‌మెంట్ స్టడీస్

అర్హత కలిగిన విద్యార్థులు ఐఐటీ మద్రాస్ ఇంటర్న్​షిప్​ 2026 కోస అధికారిక వెబ్‌సైట్‌లోని రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

లేదా.. ఐఐటీ మద్రాస్​ ఇంటర్న్​షిప్​ 2026 రిజిస్ట్రేషన్​కి సంబంధించిన డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe