...
...
Next Story

IMD rain alert : ఇక జోరుగా వర్షాలు- పలు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ!

ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాల్లో రాగల 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐఎండీ లేటెస్ట్ వెదర్​ అప్డేట్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 3, 2026, 06:45:42 IST
Advertisement

నైరుతి రుతుపవనాలు జోరందుకున్న వేళ రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఈశాన్య భారతం సహా మధ్య, తూర్పు హిమాలయ పర్వత ప్రాంతాల్లో వర్షాల తీవ్రత గణనీయంగా పెరగనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో దక్షిణాదిలో వర్షాల ప్రభావం తగ్గినా.. కర్ణాటక తీర ప్రాంతాలు, దక్షిణ లోతట్టు జిల్లాలు, కేరళలో మాత్రం మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడవచ్చని స్పష్టం చేసింది.

ప్రాంతాల వారీగా వాతావరణ సూచన..

ఐఎండీ లేటెస్ట్ వెదర్ అప్డేట్స్.. (HT)
ఐఎండీ లేటెస్ట్ వెదర్ అప్డేట్స్.. (HT)

ఈశాన్య భారత్: ఆగస్టు 5న అరుణాచల్ ప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 3 నుంచి 5 మధ్య అసోం, మేఘాలయల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అలాగే నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఆగస్టు 3 నుంచి 8 వరకు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

ఉత్తర భారత్: జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లలో ఆగస్టు 3 నుంచి 6 వరకు, తిరిగి ఆగస్టు 8న వానలు పడతాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఆగస్టు 3 నుంచి 8 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మైదాన ప్రాంతాలు: ఆగస్టు 3 నుంచి 6 వరకు హర్యానా, ఛండీగఢ్, దిల్లీ, పంజాబ్‌లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 3 నుంచి 7 మధ్య తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో, ఆగస్టు 4 నుంచి 7 మధ్య పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పడే వర్షాలు ఉత్తర భారతంలో వర్షాకాలం చురుగ్గా ఉందనే సంకేతాన్ని ఇస్తున్నాయి.

ఆకస్మిక వరదల ముప్పు.. అలర్ట్‌లు జారీ

భారీ వర్షాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాలకు ఐఎండీ ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, ఉత్తరాఖండ్‌లలోని కొన్ని ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో తక్కువ నుంచి మోస్తరు స్థాయిలో ఫ్లాష్ ఫ్లడ్‌లు వచ్చే ముప్పు ఉందని హెచ్చరించింది. ఇప్పటికే నేలల్లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది.

ఝార్ఖండ్‌ రాష్ట్రంలోనూ రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. పిడుగులు పడే ప్రమాదంతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు ఆగస్టు 3 నుంచి 6 వరకు పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks