IND vs SL free entry : ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇండియా- శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు స్టేడియాలలోకి ఉచిత ప్రవేశం!
India vs Sri Lanka Test free tickets : భారత్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఫ్యాన్స్ ఉచితంగా స్టేడియంలోనే వీక్షించవచ్చని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఎలాంటి టికెట్లు లేకుండానే నిర్ణీత గేట్ల ద్వారా ప్రవేశం కల్పించనున్నారు.
భారత్, శ్రీలంక జట్ల మధ్య త్వరలో ప్రారంభంకానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. స్టేడియాలకు అభిమానులను రప్పించేందుకు ఈ సిరీస్‌ను ఉచితంగా వీక్షించేందుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది! ఎలాంటి టికెట్లు కొనుగోలు చేయకుండానే నిర్ణీత గేట్ల ద్వారా స్టేడియంలోకి ప్రవేశించవచ్చని స్పష్టం చేసింది.

"శ్రీలంక, భారత్ మధ్య జరగబోయే ఈ టెస్ట్ సిరీస్‌కు స్టేడియాలలోకి ప్రజల ప్రవేశం ఉచితం అని తెలియజేయడానికి శ్రీలంక క్రికెట్ బోర్డు ఎంతో సంతోషిస్తోంది. ప్రపంచ స్థాయి టెస్ట్ క్రికెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి ఇది క్రికెట్ అభిమానులకు ఒక అద్భుతమైన అవకాశం," అని శ్రీలంక క్రికెట్ బోర్డు తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు, యువ క్రీడాకారులు, కుటుంబసమేతంగా వచ్చి ఈ మ్యాచ్‌లను ఆస్వాదించాలని బోర్డు సాదరంగా ఆహ్వానించింది.
అభిమానులను ఆకర్షించే వ్యూహం!
స్టేడియాలకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చేలా చేయాలనే ఉద్దేశంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గతంలో న్యూజిలాండ్, ఐర్లాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్ట్ సిరీస్‌ల సమయంలోనూ ఇలాగే ఉచిత ప్రవేశం కల్పించారు. అలాగే 2026 టీ20 ప్రపంచ కప్ సమయంలో శ్రీలంకలో జరిగిన నాన్-శ్రీలంక మ్యాచ్‌లకు కూడా ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. లంక ప్రీమియర్ లీగ్ టోర్నీలోనూ ప్రేక్షకుల స్పందన తక్కువగా ఉండటంతో చివరికి ఉచిత ప్రవేశం కల్పించిన సంగతి తెలిసిందే.
ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా ప్రారంభమవుతుంది. 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో భాగంగా ఈ రెండు మ్యాచ్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి.
మొదటి టెస్ట్ జరిగే గాలే స్టేడియంలో అభిమానులు 'గేట్ నంబర్ 4' ద్వారా ఉచితంగా లోపలికి వెళ్లవచ్చు. కొలంబోలోని ఎస్ఎస్‌సీ స్టేడియంలో జరిగే రెండో టెస్ట్ కోసం 3, 4, 5, 7 గేట్ల ద్వారా ప్రవేశం కల్పించనున్నారు.
సుదీర్ఘ విరామం తరువాత భారత్ లంక పర్యటన..
భారత జట్టు శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడటం 2017 తర్వాత ఇదే మొదటిసారి. ఆ ఏడాది జరిగిన టూర్‌లో భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో భాగంగా ఇరు జట్లు మరోసారి తలపడుతున్నాయి.
ఈ లేటెస్ట్ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో బలమైన భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా తదితరులు జట్టులో ఉన్నారు.
ప్రస్తుతం కొలంబోలోని ఎన్‌సీసీ స్టేడియంలో శ్రీలంక ఎక్స్ఐ జట్టుతో భారత్ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసేసరికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. రవిందు రసాంత 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు కుడి చేతి వేలికి గాయం కావడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి రోజు ఆటకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపించాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


