Rishabh Pant: రిషబ్ పంత్ ఔట్.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న వికెట్ కీపర్.. ఐపీఎల్ 2026 వైఫల్యంతో..

Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు రిషబ్ పంత్. ఐపీఎల్ 2026లో ఆ టీమ్ దారుణమైన ప్రదర్శనతో పంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగతంగా కూడా పంత్ అసలు రాణించలేకపోయాడు.

Published on: May 29, 2026, 17:27:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rishabh Pant: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. లక్నో ఫ్రాంచైజీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో (10వ స్థానం) నిలవడంతో, పంత్ తన కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నారు. శుక్రవారం (మే 29)నాడు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

Rishabh Pant: రిషబ్ పంత్ ఔట్.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న వికెట్ కీపర్.. ఐపీఎల్ 2026 వైఫల్యంతో.. (HT_PRINT)
Rishabh Pant: రిషబ్ పంత్ ఔట్.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న వికెట్ కీపర్.. ఐపీఎల్ 2026 వైఫల్యంతో.. (HT_PRINT)

లక్నో ఘోర వైఫల్యం – పంత్ వైదొలగడానికి కారణాలివే

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచిన రిషబ్ పంత్, లక్నో జట్టును విజేతగా నిలపడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు రికార్డు స్థాయిలో ఏకంగా రూ.27 కోట్లకు లక్నో ఫ్రాంచైజీ పంత్‌ను కొనుగోలు చేసింది. అయితే అంత భారీ ధర పలికినప్పటికీ ఆయన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

పంత్ నాయకత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ గత రెండు సీజన్లలో (2025, 2026) కనీసం ప్లేఆఫ్స్ దశకు కూడా అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్ 2026లో లక్నో జట్టు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది. వరుస ఓటములతో నిరాశ చెందిన పంత్.. మ్యాచ్ ముగిసిన తర్వాత బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడే సమయంలోనూ తీవ్ర నిస్సహాయతతో కనిపించేవాడు.

లక్నో సూపర్ జెయింట్స్ అధికారిక ప్రకటన

రిషబ్ పంత్ స్వయంగా చేసిన అభ్యర్థనను గౌరవిస్తూ అతనిని కెప్టెన్సీ బాధ్యతల నుండి తక్షణమే తప్పిస్తున్నట్లు లక్నో ఫ్రాంచైజీ ప్రకటించింది.

"రిషబ్ పంత్ స్వయంగా తనను కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించాలని కోరారు, అతని అభ్యర్థనను ఫ్రాంచైజీ తక్షణమే ఆమోదించింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ సులభం కాదు. కెప్టెన్‌గా లక్నో డ్రెస్సింగ్ రూమ్‌కు రిషబ్ అందించిన సేవలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రస్తుత హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆధ్వర్యంలో మా దృష్టి అంతా ఇప్పుడు జట్టును తిరిగి పునర్నిర్మించడం, సరికొత్త ప్రమాణాలను అందుకోవడానికి పునర్వ్యవస్థీకరించడంపైనే ఉంది" అని లక్నో ఫ్రాంఛైజీ తెలిపింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుండి రిషబ్ పంత్ ఎందుకు తప్పుకున్నాడు?

ఐపీఎల్ 2026లో లక్నో జట్టు 10వ స్థానంలో నిలిచి ఘోరంగా విఫలం కావడం, గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరకపోవడంతో పంత్ స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

2. రిషబ్ పంత్‌ను లక్నో ఫ్రాంచైజీ ఎంత ధరకు కొనుగోలు చేసింది?

2025 ఐపీఎల్ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు దక్కించుకుంది.

3. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ ఎవరు, జట్టు తదుపరి ప్లాన్ ఏంటి?

లక్నో జట్టుకు జస్టిన్ లాంగర్ హెడ్ కోచ్‌గా ఉన్నారు. కెప్టెన్సీ మార్పు తర్వాత ఫ్రాంచైజీని పూర్తిగా పునర్నిర్మించడంపై దృష్టి పెట్టనున్నట్లు యాజమాన్యం తెలిపింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More