Ind vs Eng: డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడానికి ఒక గెలుపు దూరంలో నిలిచింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్ ను 7 పరుగులతో ఓడించి ఫైనల్ చేరింది. ఈ మెగాటోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది సూర్య సేన. ఆదివారం (మార్చి 8) న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్లో కప్పు కోసం తలపడనుంది. 254 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లండ్ చివరికి 7 వికెట్లకు 246 రన్స్ చేసింది. 42 బంతుల్లో 89 రన్స్ చేసి సంజూ శాంసన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
జాకబ్ బెథెల్ మెరుపు సెంచరీ చేసినా..

ఇంగ్లండ్ ముందు ఏకంగా 254 పరుగుల లక్ష్యాన్ని ఉంచినా.. ఆ టీమ్ ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేసి టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా అతడు 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 105 రన్స్ చేసి ఔటయ్యాడు. విల్ జాక్స్ 20 బంతుల్లో 35 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు. అయితే కీలకమైన సమయంలో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్, క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇండియన్ టీమ్ 7 పరుగులతో గట్టెక్కింది. బుమ్రా 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
చితకబాదిన సంజూ, ఇషాన్
అంతకుముందు టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే అది ఎంత తప్పుడు నిర్ణయమో సంజూ శాంసన్ త్వరలోనే చూపించాడు. ఆ టీమ్ బౌలర్లను ఊచకోత కోస్తూ తన చివరి సూపర్ 8 మ్యాచ్ ఫామ్ ను కొనసాగించాడు.
అభిషేక్ శర్మ (9) మరోసారి నిరాశ పరిచినా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39)తో కలిసి రెండో వికెట్ కు 97 రన్స్ జోడించి టీమిండియా కళ్లు చెదిరే స్టార్ట్ ఇచ్చాడు సంజూ శాంసన్. ఈ క్రమంలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడు. గత మ్యాచ్ లో 97 రన్స్ దగ్గర ఆగి తృటిలో సెంచరీ మిస్సయిన అతడు.. ఈసారి సెంచరీ ఖాయంగా చేస్తాడనుకున్నా 89 రన్స్ దగ్గర ఔటయ్యాడు.
శివమ్, హార్దిక్, తిలక్ దూకుడు
ఇషాన్, సంజూ ఔటైన తర్వాత కూడా శివమ్ దూబె చెలరేగాడు. అతనికితోడు హార్దిక్ పాండ్యా కూడా చివర్లో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దూబె 25 బంతుల్లోనే 4 సిక్స్ లు, ఒక ఫోర్ 43 రన్స్ చేశాడు. ఇక తిలక్ వర్మ ఉన్నది కొద్దిసేపే అయినా 7 బంతుల్లో 21 రన్స్ చేయడం విశేషం. అటు హార్దిక్ కూడా 12 బంతుల్లోనే 27 రన్స్ చేశాడు. దీంతో ఇండియా 253 పరుగులు చేయగలిగింది.
{{/usCountry}}ఇషాన్, సంజూ ఔటైన తర్వాత కూడా శివమ్ దూబె చెలరేగాడు. అతనికితోడు హార్దిక్ పాండ్యా కూడా చివర్లో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దూబె 25 బంతుల్లోనే 4 సిక్స్ లు, ఒక ఫోర్ 43 రన్స్ చేశాడు. ఇక తిలక్ వర్మ ఉన్నది కొద్దిసేపే అయినా 7 బంతుల్లో 21 రన్స్ చేయడం విశేషం. అటు హార్దిక్ కూడా 12 బంతుల్లోనే 27 రన్స్ చేశాడు. దీంతో ఇండియా 253 పరుగులు చేయగలిగింది.
{{/usCountry}}ఇండియా బ్యాటర్ల ధాటికి ప్రతి ఇంగ్లండ్ బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. వాళ్ల స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అయితే 4 ఓవర్లలో ఏకంగా 61 రన్స్ ఇచ్చాడు. ఇక సామ్ కరన్ కూడా 4 ఓవర్లలో 53 రన్స్ ఇవ్వడం విశేషం.