టీమిండియాను ఒంటిచేత్తో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేర్చిన సంజూ శాంసన్ తన ఫామ్ కొనసాగిస్తూ ఇంగ్లండ్ బౌలర్లను కూడా చితకబాదాడు. అతడు కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 89 రన్స్ చేయడంతో ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 రన్స్ చేసింది.
చితకబాదిన సంజూ, ఇషాన్
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే అది ఎంత తప్పుడు నిర్ణయమో సంజూ శాంసన్ త్వరలోనే చూపించాడు. ఆ టీమ్ బౌలర్లను ఊచకోత కోస్తూ తన చివరి సూపర్ 8 మ్యాచ్ ఫామ్ ను కొనసాగించాడు.
అభిషేక్ శర్మ (9) మరోసారి నిరాశ పరిచినా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39)తో కలిసి రెండో వికెట్ కు 97 రన్స్ జోడించి టీమిండియా కళ్లు చెదిరే స్టార్ట్ ఇచ్చాడు సంజూ శాంసన్. ఈ క్రమంలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడు. గత మ్యాచ్ లో 97 రన్స్ దగ్గర ఆగి తృటిలో సెంచరీ మిస్సయిన అతడు.. ఈసారి సెంచరీ ఖాయంగా చేస్తాడనుకున్నా 89 రన్స్ దగ్గర ఔటయ్యాడు.
శివమ్, హార్దిక్, తిలక్ దూకుడు
ఇషాన్, సంజూ ఔటైన తర్వాత కూడా శివమ్ దూబె చెలరేగాడు. అతనికితోడు హార్దిక్ పాండ్యా కూడా చివర్లో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దూబె 25 బంతుల్లోనే 4 సిక్స్ లు, ఒక ఫోర్ 43 రన్స్ చేశాడు. ఇక తిలక్ వర్మ ఉన్నది కొద్దిసేపే అయినా 7 బంతుల్లో 21 రన్స్ చేయడం విశేషం. అటు హార్దిక్ కూడా 12 బంతుల్లోనే 27 రన్స్ చేశాడు. దీంతో ఇండియా 253 పరుగులు చేయగలిగింది.
ఇండియా బ్యాటర్ల ధాటికి ప్రతి ఇంగ్లండ్ బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. వాళ్ల స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అయితే 4 ఓవర్లలో ఏకంగా 61 రన్స్ ఇచ్చాడు. ఇక సామ్ కరన్ కూడా 4 ఓవర్లలో 53 రన్స్ ఇవ్వడం విశేషం.
{{/usCountry}}ఇండియా బ్యాటర్ల ధాటికి ప్రతి ఇంగ్లండ్ బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. వాళ్ల స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అయితే 4 ఓవర్లలో ఏకంగా 61 రన్స్ ఇచ్చాడు. ఇక సామ్ కరన్ కూడా 4 ఓవర్లలో 53 రన్స్ ఇవ్వడం విశేషం.
{{/usCountry}}