బ్లాక్ బస్టర్ పోరుకు రంగం సిద్ధమైంది. హై వోల్టేజీ సమరానికి టైమ్ ఆసన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఈ రోజే. ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
నో షేక్ హ్యాండ్

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో అందరూ అనుకున్నట్లుగానే ఆటగాళ్ల మధ్య షేక్ హ్యాండ్ లేదు. పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేసేందుకు ఇండియన్ ప్లేయర్లు నిరాకరించారు. టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీన్ని బట్టి మరోసారి ఇండియా, బీసీసీఐ తన వైఖరిని బలంగా చాటింది.
ఆ డ్రామా తర్వాత
నిజానికి టీ20 ప్రపంచకప్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగడంపై మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఐసీసీ వార్నింగ్ తో పాక్ తోక ముడిచింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు దిగి వచ్చింది. అయితే ఇండియాతో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు కండీషన్లు పెట్టిందనే వార్తలు వచ్చాయి. వీటిని ఐసీసీ పట్టించుకోలేదని తెలిసింది.
డిఫెండింగ్ ఛాంపియన్
టీ20 ప్రపంచకప్ లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగింది. 2024 టీ20 ప్రపంచకప్ కు భారత్ గెలిచింది. ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్ లోనూ టైటిల్ లక్ష్యంగా అడుగుపెట్టింది. గ్రూప్-ఎలో ఇప్పటికే అమెరికా, నమీబియాను ఇండియా చిత్తు చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ పై విక్టరీతో సూపర్ 8లో ప్లేస్ కన్ఫామ్ చేసుకోవడమే భారత టీమ్ టార్గెట్.
అభిషేక్ శర్మ
పాకిస్థాన్ తో పోరులో అందరి ఫోకస్ ప్రధానంగా ఇండియన్ డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మపైనే ఉంది. కడుపు నొప్పితో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న అభిషేక్.. నమీబియాతో మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇప్పుడు పాకిస్థాన్ తో పోరుకు తిరిగివచ్చిన అతను ఓపెనింగ్ ఓవర్లలోనే చెలరేగాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక అర్ష్ దీప్ స్థానంలో స్పిన్నర్ కుల్ దీప్ ఫైనల్ ఎలెవన్ లోకి వచ్చాడు.
{{/usCountry}}పాకిస్థాన్ తో పోరులో అందరి ఫోకస్ ప్రధానంగా ఇండియన్ డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మపైనే ఉంది. కడుపు నొప్పితో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న అభిషేక్.. నమీబియాతో మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇప్పుడు పాకిస్థాన్ తో పోరుకు తిరిగివచ్చిన అతను ఓపెనింగ్ ఓవర్లలోనే చెలరేగాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక అర్ష్ దీప్ స్థానంలో స్పిన్నర్ కుల్ దీప్ ఫైనల్ ఎలెవన్ లోకి వచ్చాడు.
{{/usCountry}}మరోవైపు పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్ ను ఇండియన్ బ్యాటర్లు జాగ్రత్తగా ఫేస్ చేయాలని మాజీలు చెప్తున్నారు. సూర్యకుమార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మరి ఈ స్పిన్నర్ ను మన ఇండియన్ బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలి.