Ind vs Wi: రోకో ఈజ్ బ్యాక్..వెస్టిండీస్‌తో ఇండియా వన్డే..టాస్ గెలిచిన భారత్..కొత్త ప్లేయర్..లైవ్ ఎక్కడ చూడాలంటే?
Ind vs Wi: టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చారు. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న ఈ ఇద్దరూ.. ఇవాళ గ్రౌండ్ లోకి దిగుతున్నారు. వెస్టిండీస్ తో ఫస్ట్ వన్డే లో వాళ్లు ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేయండి.
Ind vs Wi: 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలే లక్ష్యంగా టీమిండియా నేడు కేరళ వేదికగా వెస్టిండీస్‌తో తొలి వన్డేలో తలపడుతోంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టులో దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీ-ఎంట్రీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

టాస్ గెలిచిన భారత్
వెస్టిండీస్ తో ఇవాళ (సెప్టెంబర్ 27) జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమ్ లోకి కొత్త ప్లేయర్ నమన్ ధీర్ వచ్చాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అయింది.
మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్
ఇవాళ జరుగుతున్న ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వన్డేను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అలాగే జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ మ్యాచ్ ను చూడొచ్చు. శ్రేయస్ అయ్యర్, బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు ఆసియా క్రీడల స్క్వాడ్‌లో ఉండటంతో కొత్త టాలెంట్ తో భారత్ రంగంలోకి దిగుతోంది.
2027 వన్డే వరల్డ్ కప్ మిషన్
దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌కు బలమైన పునాది వేయడమే ధ్యేయంగా టీమిండియా కేరళలో వెస్టిండీస్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత మళ్లీ జాతీయ జట్టు వన్డే జెర్సీలో దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వంటి డాషింగ్ బ్యాటర్లతో పాటు రోహిత్, కోహ్లీల సుదీర్ఘ అనుభవం భారత్‌కు కొండంత బలాన్ని ఇస్తోంది.
కీలక ప్లేయర్లు ఔట్
ఆసియా క్రీడల స్క్వాడ్‌లో చోటు దక్కించుకోవడంతో శ్రేయస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ ఈ వన్డే సిరీస్‌కు అందుబాటులో లేరు. అక్షర్ పటేల్ లేకపోవడంతో రవీంద్ర జడేజా మళ్లీ వన్డే జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా దూరమైన తరుణంలో ఆసియా క్రీడల స్క్వాడ్ నుంచి నితీష్ కుమార్ రెడ్డిని ఆల్ రౌండర్ ప్రత్యామ్నాయంగా వన్డే జట్టులోకి మేనేజ్‌మెంట్ తీసుకొచ్చింది.
పేస్ విభాగంలో గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు షాయ్ హోప్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు రోస్టన్ చేజ్, షెఫానె రూథర్‌ఫోర్డ్, అల్జారీ జోసెఫ్, రీ-ఎంట్రీ ఇచ్చిన జాన్ క్యాంప్‌బెల్‌లతో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


