Rohit Kohli: అదే మా చివరి వరల్డ్ కప్.. రో-కో సంచలన వ్యాఖ్యలు.. 2027 వన్డే ప్రపంచకప్‌పై కోహ్లీ, రోహిత్ క్లారిటీ!
Rohit Kohli: 2027 వన్డే ప్రపంచకప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడతారా లేదా? అప్పటివరకూ ఫిట్ నెస్ తో ఉంటారా? ముందే రిటైరైపోతారా? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటన్నింటికీ తాజాగా రోహిత్, కోహ్లి ఆన్సర్ ఇచ్చారు. 2027 వన్డే ప్రపంచకప్ పై రోకో సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇక్కడ చూసేయండి.
Rohit Kohli: 2024 టీ20 ప్రపంచకప్ విక్టరీ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు, ఆ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కన్ను ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్‌పైనే పడింది. వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన రో-కో సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదే నా ఆఖరి వరల్డ్ కప్
వచ్చే ఏడాది దక్షణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీయే భారత్ తరఫున తాను ఆడే చివరి వరల్డ్ కప్ అని రన్‌మెషిన్ విరాట్ కోహ్లి అధికారికంగా స్పష్టం చేశారు.
"వన్డే వరల్డ్ కప్ ఇంటెన్సిటి చాలా ఎక్కువగా ఉంటుంది. టీ20 ఇంటెన్సిటీతో 10 మ్యాచ్‌లు ఆడటం సాధారణ విషయం కాదు. పైగా విదేశీ పిచ్‌లపై ఈ సవాలు మరీ ఎక్కువ. ఇది భారత్ తరఫున నాకు చివరి ప్రపంచకప్ (2027). అందుకే నా శక్తినంతా ధారపోసి కప్‌ను గెలవడమే నా ఏకైక లక్ష్యం. దానికోసం ఎంతైనా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను" అని కోహ్లీ తెలిపారు.
ఆ కల ఇంకా నెరవేరలేదు
మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు వన్డే ప్రపంచకప్ గెలవాలనే కోరిక ఇంకా అలానే ఉంది. 2023లో అహ్మదాబాద్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి రోహిత్‌ను తీవ్రంగా గాయపరిచింది. అందుకే ప్రపంచకప్ టార్గెట్ ను మర్చిపోలేదు.
38 ఏళ్ల వయసులోనూ బరువు తగ్గి, ఆటకు ఏమాత్రం విరామం ఇవ్వకుండా పరుగుల వరద పారిస్తున్న రోహిత్.. "కెరీర్ ముగిసిపోయిందనే ఆలోచన నా మైండ్‌లోకి రాదు. వన్డే ప్రపంచకప్ ఛాలెంజ్ చాలా ప్రత్యేకమైంది. వేర్వేరు ప్రత్యర్థులు, రకరకాల వేదికలు ఉంటాయి. దానికోసం భిన్నమైన వ్యూహాలతో సిద్ధం కావాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో జరగబోయే ఈ టోర్నీలో నా 'అన్‌ఫినిష్డ్ బిజినెస్'ను పూర్తి చేయడమే నా టార్గెట్" అని స్పష్టం చేశారు.
మోస్ట్ ఇంపార్టెంట్!
2011 తర్వాత భారత్ మళ్లీ 50 ఓవర్ల ప్రపంచకప్ గెలవకపోవడం ఒక శాపంగా మారింది. రోహిత్-కోహ్లీ ద్వయం జట్టును ముందుకు నడిపినా ఐసీసీ ట్రోఫీ చేజారుతూ వచ్చింది. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి టీ20లు, ఆ తర్వాత టెస్టుల నుంచి వైదొలిగిన తర్వాత, వీరు ఇద్దరూ కేవలం వన్డే ఫార్మాట్‌పై మాత్రమే పూర్తి దృష్టి పెట్టడం భారత క్రికెట్‌కు ప్లస్ పాయింట్.
కేవలం ఒక్క ఫార్మాట్‌పైనే ఫోకస్ చేయడం వల్ల ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ సెట్ అవుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో జరగబోయే వరల్డ్ కప్‌లో ఈ దిగ్గజ ద్వయం భారత్‌కు మరో ఐసీసీ ట్రోఫీ అందించాలనే పట్టుదలతో ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


