Team India Record: ఇదేం బాదుడు సామి.. టీ20ల్లో తిరుగులేని టీమిండియా.. జింబాబ్వేపై 200 ప్లస్ స్కోరుతో ప్రపంచ రికార్డు!
Team India Record: టీ20ల్లో టీమిండియా డామినెన్స్ మామూలుగా లేదు. పొట్టి క్రికెట్లో రికార్డుల వేటలో భారత జట్టు దూసుకెళ్తోంది. బ్యాటింగ్ లో ఈజీగా 200 స్కోరు కొట్టేస్తూ కొత్త రికార్డులు ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా జింబాబ్వేతో మ్యాచ్ లో ఇండియా ప్రపంచ రికార్డు సమం చేసింది.
Team India Record: అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో టీమిండియా భారీ స్కోరు సాధించడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును సమం చేసింది.

చెలరేగిన ఇండియా
ఇవాళ (జూలై 25) జింబాబ్వేతో రెండో టీ20లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 నాటౌట్) చెలరేగారు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది.
ప్రపంచ రికార్డు
జింబాబ్వేపై బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత్ ప్రపంచ రికార్డు సమం చేసింది. ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
జింబాబ్వే బౌలర్లను ఆడుకుంటూ భారత బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. టీమిండియా మైదానంలో పరుగుల వరద పారించడంతో 200 పరుగుల మార్కును సులువుగా దాటేసింది. ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో భారత జట్టు 200 ప్లస్ స్కోరును నమోదు చేయడం ఇది 9వ సారి కావడం విశేషం.
ఇండియా హిస్టరీ
ఒక ఏడాదిలో టీ20ల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోరు చేసిన రికార్డు ఇండియా పేరు మీదే ఉంది. 2024లో భారత్ 9 సార్లు ఈ ఘనత సాధించింది. ఈ ఇయర్ లో ఇప్పటికే 9 సార్లు 200 ప్లస్ స్కోరు చేసి ప్రపంచ రికార్డు సమం చేసింది. ఈ ఏడాది టీమిండియా తన రికార్డును తానే బ్రేక్ చేసుకునే అవకాశం ఉంది. మూడో ప్లేస్ లోనూ భారత్ (7 సార్లు) ఉంది. జపాన్, ఆస్ట్రియా కూడా 7 సార్లు ఈ ఫీట్ సాధించాయి.
ఓవరాల్ టి20ల్లో అగ్రస్థానం
కేవలం అంతర్జాతీయ టి20ల్లోనే కాకుండా, ఓవరాల్ టి20 క్రికెట్ (ఐపీఎల్, ఇతర లీగ్ మ్యాచ్‌లతో కలిపి) చరిత్రను పరిశీలిస్తే, అత్యధిక సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టు ఇండియానే.
భారత్ ఇప్పటివరకూ ఓవరాల్ గా ఇంటర్నేషనల్ టీ20ల్లో 52 సార్లు 200కు పైగా స్కోరు చేసింది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (29)కు ఇండియాకు మధ్య చాలా గ్యాప్ ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


